స్టార్ కిడ్నే.. కానీ క్యాస్టింగ్ కౌచ్‌కి బాధితురాలినే: మంచు లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాల్లో అవకాశాల పేరిట యువతులను లోబరచుకునే ‘‘క్యాస్టింగ్ కౌచ్’’ మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల అగ్ర కథానాయిక అనుష్క సైతం క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవకాశాలు ఆశచూపి అమ్మాయిలను లొంగదీసుకునే విష సంస్కృతి టాలీవుడ్‌లోనూ వుందన్నారు. కెరీర్ బిగినింగ్ లో తాను కూడా చూశానని... అయితే నేను ప్రతి విషయంలో ముక్కుసూటిగా వుంటానని, కరెక్ట్ గా మాట్లాడతాని స్వీటీ చెప్పారు. తన మనస్తత్వం తెలిసి, తన దగ్గరకు ఎవరూ ఇలాంటి ప్రతిపాదనలు తీసుకురాలేదు అని అనుష్క అన్నారు. తర్వాత కొద్దిరోజులకే మరో నటి ఎస్తర్ సైతం క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. ఆఫర్స్ రావాలంటే కమిట్మెంట్ ఇస్తావా..? అని చాలా మంది అడిగారని.. వాటికి ఒప్పుకోకపోతే కెరీర్ ఇక్కడితోనే ఆగిపోతుందని తనను బెదిరించారని ఎస్తర్ తెలిపింది.
అయితే బయటి నుంచి వచ్చే వాళ్లకే కాదు.. సినీ నేపథ్యంలో వుండి, బలమైన బ్యాక్‌గ్రౌండ్ వున్న వారికి కూడా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురైతే. వినడానికి ఆశ్చర్యంగా వున్నా ఇది నిజం. ఈ విషయాలను స్వయంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారాలపట్టి మంచు లక్ష్మీ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. తను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని మంచు లక్ష్మీ పేర్కొంది. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీ కి వచ్చినా కాస్టింగ్ కౌచ్, బాడీ షేమింగ్ సమస్యలను ఎదుర్కోక తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు . ప్రస్తుతం మంచు లక్ష్మి కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) కూతురు అయినప్పటికీ ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని నెటిజన్లు అంటున్నారు.
కాగా.. గతేడాది 'పిట్టకథలు' యాంథాలజీతో లక్ష్మీ మంచు ఓటీటీ ప్రేక్షకులను అలరించారు. అలాగే రెండు మూడు టీవీ షోల్లోనూ సందడి చేశారు. ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న చేతిలో మూడు నాలుగు సినిమాలు వున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాలోనూ ఆమె నటిస్తున్నారు. ఇటీవల కోవిడ్ బారినపడిన మంచు లక్ష్మీ కోలుకున్న అనంతరం యథావిధిగా షూటింగ్‌లకు హాజరవుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout