లక్ష్మి మంచు ప్రధాన పాత్రలో ప్రొడక్షన్ నెం.4 ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రతీ చిత్రంతోనూ వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ, నటిగా, నిర్మాతగా, సమాజ సేవకిగా పేరుపొందిన మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో, ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి, దొంగాట వంటి మంచి పేరు తెచ్చుకున్న సినిమాలను నిర్మించిన మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.4 గా, విజయ్ యలంకంటి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ, నిర్మించనున్న చిత్రం ఈరోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. పూజానంతరం మంచు మనోజ్, మనోజ్ భార్య ప్రణతి, మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ స్క్రిప్ట్ ను నిర్మాత మంచు లక్ష్మి, డైరక్టర్ విజయ్ లకు అందించారు.
అనంతం నటి, నిర్మాత మంచు లక్ష్మి మాట్లాడుతూ, చాలా రోజుల తర్వాత మా బ్యానర్ నుంచి వస్తున్న సినిమా ఇది. నిజం కాని విషయాన్ని నిజమని భావించే ఓ యువతి కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా, మనిషి ఎమోషన్స్, రిలేషన్‌షిప్స్ చుట్టూనే కథంతా తిరుగుతుంది. ఇన్ని రోజుల తర్వాత మళ్లీ డైరక్టర్ విజయ్ అందించిన మంచి కథతో మీ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. విజయ్ ఇప్పటికే ఈగ, బాహుబలి-1 సినిమాలకు రాజమౌళి గారి దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశాడు. ఈ సినిమాతో ఖచ్చితంగా తన ప్రతిభను నిరూపించుకుంటాడు అన్నారు. సినిమాతో పాటూ యప్ టీవీ ఆధ్వర్యంలో ఓ వెబ్ సిరీస్ ను కూడా మొదలుపెట్టబోతున్నాం. వీటికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
మంచు లక్ష్మి ప్రధానపాత్రలో నటించనున్న, ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా సుహాసిని(ఇంతకుముందు పీవీపీ కి, మరియు ఇప్పుడు రానా నిర్మాణంలో రాబోతున్న చిత్రానికి ఈమె పనచేస్తున్నారు..), ప్రొడక్షన్ డిజైనర్ గా పెళ్లి చూపులు సినిమాకు పని చేసిన లత పనిచేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com