మంచు లక్ష్మికి షాక్ ఇచ్చిన హ్యాకర్స్
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు లక్ష్మి.. స్టార్ హీరోయిన్స్‌తో సమానంగా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయిన నటి. ఆమెపై వచ్చినన్ని ట్రోల్స్ మరే నటిపై కూడా రాలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఆమె భాషపై ట్రోల్స్, మీమ్స్ చాలానే వచ్చాయి. అయితే మంచు లక్ష్మి మాత్రం ట్రోల్స్‌ను కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే తాజాగా మంచు లక్ష్మికి హ్యాకర్స్ ఊహించని షాక్ ఇచ్చారు. ఆమె యూట్యూబ్ ఛానెల్‌ను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని మంచు లక్ష్మి ట్విటర్ వేదికగా తెలిపారు.
మంచు లక్ష్మి ’చిట్టి చిలకమ్మా’ అనే పేరుతో ఓ యూ ట్యూబ్ చానెల్‌ను ఇటీవలే స్టార్ట్ చేశారు. దీనికి వ్యూస్ కూడా లక్షల్లో వస్తుంటాయి. తన కూతురు విద్యానిర్వాణతో కలిసి వీడియోలు చేస్తుంటారు. ఇందులో పిల్లలకు అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా పాఠాలు బోధిస్తుంటారు. తన కుమార్తె విద్యా నిర్వాణ ద్వారా పిల్లల పెంపకం, వారికి చదువు చెప్పే విషయాల్లో పాటించాల్సిన పద్ధతులను మంచు లక్ష్మి వివరిస్తూ వస్తున్నారు. చానెల్ హ్యాక్ అయిన తర్వాత.. తమ యూ ట్యూబ్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని, అందులో నుంచి ఏదేని అర్థ రహితమైన సమాచారం వస్తే పట్టించుకోవద్దని, తమ టీమ్ సైట్‌ను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తుందని మంచు లక్ష్మి తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments