ఫ్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా 'వైఫ్ ఆఫ్ రామ్' - లక్ష్మీ మంచు
- IndiaGlitz, [Wednesday,July 18 2018]
వైఫ్ ఆఫ్ రామ్.. విడుదలకు ముందే ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్స్ కు వెళ్లిన సినిమా. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఎన్నో థ్రిల్లర్ సినిమాల్లో మనదైన ముద్ర వేసిన తెలుగు సినిమా.
సోషల్లీ కాన్షియస్ మూవీగా ఇప్పటికే ఈ సినిమాకు మంచి పేరొచ్చింది. ట్రైలర్ కు అద్భుతమైన రెస్సాన్స్ వచ్చింది. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి విజయ్ యొలకంటి దర్శకుడు. ఈ నెల 20న విడుదల కాబోతోన్న ఈ మూవీకి సంబంధించి ఎన్నో విశేషాలను మీడియాతో షేర్ చేసుకున్నారు లక్ష్మి మంచు.
‘‘వైఫ్ ఆఫ్ రామ్ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే థ్రిల్లర్. పాటలు, ఫైట్లు ఉండవు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు. కానీ ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. తెలుగులో జానర్స్ లో వచ్చే సినిమాలు తక్కువ. వైఫ్ ఆఫ్ రామ్ ఓ కొత్త జానర్ ను పరిచయం చేస్తూ వస్తోన్న సినిమా. ఈ కథ నేను వినగానే ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోయాను. ఇది నిజంగానే జరిగిన కథ. అందుకే ఈ కథను చాలా ప్రేమించాను నేను. పాత్రలు పరిచయం చేయడం.. మెల్లగా సినిమా మూడ్ లోకి తీసుకువెళ్లడం వంటివేం ఉండవు. సీట్లో కూర్చోగానే అసలు కథ మొదలవుతుంది. పాప్ కార్న్ కొనుక్కునే టైమ్ కూడా ఉండదు.
అంత వేగంగా కథలోకి వెళ్లిపోతారు. స్టార్ట్ అయిన మరుక్షణం నుంచే మీకు అద్భుతమైన థ్రిల్ఇస్తుంది.సినిమా నిడివి కూడా రెండు గంటల్లోపే ఉంటుంది. ఇది ఓ సాధారణ అమ్మాయి, మహిళ, గృహిణి ప్రయాణం. ఒక సంఘటన తన జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది. అనేది నా పాత్ర. అయితే ఈ మధ్య వినిపిస్తోన్నట్టుగా ఈ సినిమాకు బాలీవుడ్ కహానీకి ఈ సినిమాకూ ఏ సంబధం ఉండదు. నా పాత్ర పేరు దీక్ష. తను ఓ ఎన్జీవోలో పనిచేస్తుంటుంది. తన పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోతే.. బాబాయ్ ఇంట్లో పెరుగుతుంది. తనకు నచ్చినవాడిని పెళ్లి చేసుకుని.. హ్యాపీగా ఉంటోన్న టైమ్ లో సడన్ గా దీక్ష జీవితంలో జరిగిన సంఘటన ఎలాంటి మార్పులు తెచ్చింది. సామాజికంగానూ తనకు ఏ సహాయం దొరకనప్పుడు తను న్యాయం కోసం ఏం చేసింది అనేది ఈ దీక్ష కథ. సింపుల్ గా ఇది ఓ భార్య కథ.
కొన్ని కథలు పేపర్లో ఉన్నంత గొప్పగా తెరపై కనిపించవు. కానీ ఈ కథ అలా కాదు. దర్శకుడుకి చాలా క్లారిటీ ఉంది. తను అనుకున్నది స్ఫష్టంగా తెరపైకి తీసుకువచ్చాడు. విజయ్ లాంటి ప్రతిభావంతమైన దర్శకుడిని పరిచయం చేస్తున్నందుకు నాకే గర్వంగా ఉంది. అతను ట్రూ సినిమా లవర్. ట్రూ ఫిలిమ్ మేకర్. ఇలాంటి దర్శకులు మనకు చాలా అవసరం కూడా. ఇక ఈ సినిమాలో ఆర్టిస్టులు అందరూ అత్యంత ప్రతిభావంతులే. రామ్ పాత్రలో సామ్రాట్ నటించాడు.
ఆదర్శ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ప్రియదర్శిని కమెడియన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే తీసుకున్నాం.. అయితే పాత్రలోనే వీలైనంత హ్యూమర్ పండించాడు. వైఫ్ ఆఫ్ రామ్ జర్నీ అంతా అతనుంటాడు. ఇక మా అందరికంటే ది బెస్ట్ పర్ఫార్మన్స్ ఇచ్చాడు శ్రీకాంత్ అయ్యంగార్. ఆయన నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారు. ఇక నా పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. ఇలాంటి పాత్ర చేయడం ఓ ఛాలెజింగ్ లాంటిది. అందుకే ఎక్కువ ఇష్టపడి చేశాను. మొత్తంగా ఇలాంటి సినిమా తెలుగులో రావడం ఇదే మొదటిసారి. ప్రేక్షకులను పూర్తిగా థ్రిల్ చేస్తుంది. ఆ థ్రిల్ ను మిస్ అవకూడదంటే ఈ నెల 20న ప్రతి ఒక్కరూ మా సినిమాను థియేటర్ లోనే చూడాలి’’. అని ముగించారు మంచు లక్ష్మి.
ఈ నెల 20న విడుదల కాబోతోన్న వైఫ్ ఆఫ్ రామ్ లో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోంది. సమ్రాట్ రెడ్డి, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఇతర తారాగణం.
సాంకేతిక నిపుణులు : విజువల్ ఎఫెక్ట్స్ : ఉదయ్ కిరణ్. పి, కాస్ట్యూమ్స్ : అజబ్ అలీ అక్బర్, పీ.ఆర్.వో- జి.ఎస్.కె మీడియా, ఎడిటర్ : తమ్మిరాజు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : సామల భార్గవ్, సంగీతం : రఘు దీక్షిత్, మాటలు : సందీప్ గంటా, ప్రొడక్షన్ డిజైనర్ : దీప్, సహ నిర్మాత : వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వంశీ కృష్ణ, నిర్మాణం : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్, నిర్మాతలు : టి.జి. విశ్వప్రసాద్, లక్ష్మి మంచు, రచన, దర్శకత్వం : విజయ్ యెలకంటి.