శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న మంచు లక్ష్మీ ప్రసన్న 'లక్ష్మీ బాంబ్'
Saturday, July 23, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో రూపొందుతోన్న కొత్త చిత్రం `లక్ష్మీ బాంబ్`. ఫ్రమ్ శివకాశి ట్యాగ్ లైన్. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమ లక్ష్మి నరసింహ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా...
దర్శకుడు కార్తీకేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ ` మంచి కామెడి థ్రిల్లర్, కొత్త కాన్సెప్ట్. మంచు లక్ష్మీగారు జడ్జ్ పాత్రలో నటిస్తున్నారు. ఆమె రోల్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది`` అన్నారు.
చిత్ర నిర్మాతలు వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మి నరసింహ మాట్లాడుతూ ` మంచు లక్ష్మీగారిని పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేసే చిత్రమిది. దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణగారు సినిమాను చక్కగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు మంచు లక్ష్మీగారు చేయని , పవర్ఫుల్ రోల్లో ఆమెను దర్శకుడు ప్రెజెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఫైట్ మాస్టర్స్ వెంకట్ నేతృత్వంలో ఓ ఫైట్, రాంబాబు నేతృత్వంలో మరో ఫైట్‌ను చిత్రీకరించాం. అలాగే డ్యాన్స్ మాస్టర్ కిరణ్ నేతృత్వంలో రెండు సాంగ్స్‌ను చిత్రీకరించాం. ఆగస్టు నెలాఖరు వరకు జరిగే కంటిన్యూ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments