శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న మంచు లక్ష్మీ ప్రసన్న 'లక్ష్మీ బాంబ్'

  • IndiaGlitz, [Saturday,July 23 2016]

గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భ‌వ్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో రూపొందుతోన్న‌ కొత్త చిత్రం 'లక్ష్మీ బాంబ్'. ఫ్రమ్ శివకాశి ట్యాగ్ లైన్. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమ లక్ష్మి నరసింహ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది.
ఈ సంద‌ర్భంగా...
దర్శకుడు కార్తీకేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ ' మంచి కామెడి థ్రిల్లర్, కొత్త కాన్సెప్ట్. మంచు లక్ష్మీగారు జడ్జ్ పాత్రలో న‌టిస్తున్నారు. ఆమె రోల్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది'' అన్నారు.
చిత్ర నిర్మాత‌లు వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మి నరసింహ మాట్లాడుతూ ' మంచు ల‌క్ష్మీగారిని ప‌వ‌ర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేసే చిత్ర‌మిది. ద‌ర్శ‌కుడు కార్తికేయ గోపాల‌కృష్ణ‌గారు సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మంచు ల‌క్ష్మీగారు చేయ‌ని , ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో ఆమెను ద‌ర్శ‌కుడు ప్రెజెంట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఫైట్ మాస్ట‌ర్స్ వెంకట్ నేతృత్వంలో ఓ ఫైట్‌, రాంబాబు నేతృత్వంలో మ‌రో ఫైట్‌ను చిత్రీక‌రించాం. అలాగే డ్యాన్స్ మాస్ట‌ర్ కిర‌ణ్ నేతృత్వంలో రెండు సాంగ్స్‌ను చిత్రీక‌రించాం. ఆగ‌స్టు నెలాఖ‌రు వ‌ర‌కు జ‌రిగే కంటిన్యూ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేసి వీలైనంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు సినిమాను తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.