దిశ రేప్ వీడియోల కోసం లక్షల మంది గూగుల్‌లో వెతికారు!
Send us your feedback to audioarticles@vaarta.com
వెటర్నరీ డాక్టర్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ కామాంధులను పోలీసులు అదుపులోకి తీసుకున్న మరుక్షణం నుంచే వాళ్లు భూమ్మీద బతకడానికి వీల్లేదని వెంటనే ఉరిశిక్ష లేదా ఎన్‌కౌంటర్ చేయాలంటూ.. వారుండే పోలీస్ స్టేషన్ వద్ద మహిళా సంఘాలు, ప్రజా సంఘాలతో పలు సంఘాలు పిలుపునిచ్చాయి. మరోవైపు ఈ ఘటనపై గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఉండే రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, ప్రముఖులు అందరూ స్పందించి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించకుండా ఏవేవో పిచ్చి ఫొటోలు షేర్ చేసిన కొందరు నెటిజన్ల ఆగ్రహానికి లోనయ్యారు.
యావత్ ప్రపంచం ఈ దుర్ఘటనను ముక్తకంఠంతో ఖండిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొందరు కామాంధులు.. దుర్మార్గులు ఏం చేశారో ఒకసారి చూడండి. దిశ అత్యాచారాల వీడియోల కోసం కొన్ని లక్షల మంది గూగుల్, యూట్యూబ్‌లతోపాటు నానా పోర్న్ వెబ్ సైట్లలో వెతికారు!. ‘హైదరాబాద్ రేప్ వీడియో’ అంటూ టైప్ చేసి గూగుల్‌లో వెతకడం సిగ్గుచేటు. అంతేకాదు.. డెడ్ ఫోటోస్, దిశ, బాధితురాలి ఒరిజనల్ పేరు ఇలా పలు పదాలతో సెర్చ్ ఇంజన్‌లో వెతకడం మొదలుపెట్టారు. నిజంగా దీన్ని బట్టి చూస్తే సమాజం ఎంత పుచ్చిపోయి కంపుకొడుతున్నదో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇలాంటి పుచ్చిపోయిన కంపుతో కొట్టుకుంటున్న కొందరు జనాలు ఇలా వెతకడం మొదటిసారేం కాదు.. నిర్భయ, కథువా, ఘటనల తర్వాత వీడియోల కోసం వెతికారు.
కాగా.. ఇప్పటికే ఈ ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్‌కు కొందరు నెటిజన్లపై పోలీసులకు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. వారిపై తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు కూడా. అయితే ఈ సెర్చింగ్ ఇంజన్ వ్యవహారంపై గూగుల్, పోలీసులు స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments