ల‌హ‌రి ద్వారా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ట్రైల‌ర్ రిలీజ్..!

  • IndiaGlitz, [Thursday,December 15 2016]

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కించిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానున్న చారిత్రాత్మ‌క చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ట్రైల‌ర్ ను 100 ధియేట‌ర్స్ లో ఒకేసారి రిలీజ్ చేయ‌నున్నవిష‌యం తెలిసిందే.

ప్ర‌పంచ సినిమా చ‌రిత్ర‌లో ఒక సినిమా ట్రైల‌ర్ ను 100 థియేట‌ర్స్ లో ఒకేసారి రిలీజ్ చేయ‌డం అనేది ఇదే ఫ‌స్ట్ టైమ్ కావ‌డం విశేషం. రేపు క‌రీంన‌గ‌ర్ లోని శ్రీ తిరుమ‌ల థియేట‌ర్స్ లో సాయంత్రం 5 గంట‌ల‌కు ఈ ట్రైల‌ర్ ను రిలీజ్ చేయ‌నున్నారు. ఇక యూట్యూబ్ లో గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ట్రైల‌ర్ ను ల‌హ‌రి మ్యూజిక్ సంస్థ రిలీజ్ చేస్తుంది. ఈ విష‌యాన్ని ల‌హ‌రి మ్యూజిక్ సంస్థ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసింది. ఆడియోను ఈనెలాఖ‌రున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More News

రానని చెప్పిన విశాల్ వచ్చేస్తున్నాడు

తెలుగు,తమిళ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నయువ కథానాయకుడు విశాల్ నటించిన తాజా చిత్రం కత్తి సాందాయ్.

ఈనెల 23న ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం

అల్ల‌రి న‌రేష్ హీరోగా జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హర్ర‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం. అత్తారింటికి దారేది, నాన్న‌కు ప్రేమ‌తో...చిత్రాల‌ను నిర్మించిన భారీ చిత్రాల నిర్మాణ సంస్థ‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర అధినేత‌ బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా ఛాన్స్ ఇవ్వ‌డానికి జ‌గ్గుభాయ్ రెడీ..మ‌రి మీరు..?

సినిమా రంగం పై అభిరుచి, ఆసక్తి ఉన్నా..చాలా మందికి అవకాశాల కోసం ఎవర్ని సంప్రదించాలో, తమ ప్రతిభను  ఎలా నిరూపించుకోవాలో తెలియని ప‌రిస్థితి. అందుక‌నే సినీ రంగంలో ప్ర‌వేశించాల‌నుకునే  ఔత్సాహికుల కోసం జ‌గ‌ప‌తిబాబు 'క్లిక్ సినీ కార్ట్' అనే సంస్థను నెలకొల్పిన విష‌యం తెలిసిందే.

సూర్య సింగం 3 వాయిదా..!

సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం సింగం 3.సింగం సిరీస్ లో మూడో సినిమాగా వస్తున్న సింగం3

2016 గూగూల్ హీరో ఇత‌నే..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సోష‌ల్ మీడియాలో బాగా ఏక్టీవ్ గా ఉంటార‌న్న విష‌యం తెలిసిందే. అందుక‌నే అనుకుంట‌...ఫేస్ బుక్ లో హైయ్య‌స్ట్ ఫాలోవ‌ర్స్ ఉన్న సౌత్ స్టార్ గా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేసారు.