నిఖిల్ కుమార్ సినిమా నిర్మిస్తున్న లహరి మ్యూజిక్
Send us your feedback to audioarticles@vaarta.com
కన్నడ చిత్రసీమలో తన పర్ఫార్మెన్సుతో మంచి గుర్తింపు పొందడంతో పాటు, తనదైన ముద్రవేశారు యంగ్ హీరో నిఖిల్ కుమార్. ఆయన తదుపరి సినిమా ఇటీవలే ఖరారైంది. తెలుగు, కన్నడ భాషల్లో ద్విభాషా చిత్రంగా ఏక కాలంలో ఇది రూపొందనున్నది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించనున్నారు. జనవరి 22 నిఖిల్ కుమార్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని, ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. ఈ ఆసక్తికర చిత్రంతో సౌత్ ఇండియాలోనే అగ్రగామి మ్యూజిక్ కంపెనీ అయిన లహరి మ్యూజిక్ సినీ నిర్మాణంలోకి అడుగుపెడుతుండటం విశేషం.
ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలోనే మొదలు కానున్నది. టాప్ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్యా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడంలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హీరోయిన్, ఇతర తారాగణం ఎంపిక జరుగుతోంది. అందమైన ప్రేమకథ, తగుపాళ్లలో యాక్షన్ మేళవించిన స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తయారవుతుంది. భారీ వ్యయంతో చంద్రు మనోహరన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments