నాకు పౌరుషం వచ్చింది.. ఆధారాలు బయటపెడతా!

  • IndiaGlitz, [Wednesday,January 30 2019]

తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమిదే గెలుపు అంటూ సర్వేలో తేల్చిన ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. అదికాస్త సీన్ రివర్స్ అవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆయన జాడ ఎక్కడా కనిపించలేదు. అయితే ఉన్నట్టుండి ఢిల్లీలో ప్రత్యక్షమైన ఆక్టోపస్ మీడియాతో మాట్లాడుతూ ఫలితాలపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గతంలో టీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు తానిచ్చిన సర్వే రిపోర్టు గురించి ఆయన మాట్లాడారు.

ఫస్ట్ టైం నా అంచనా తారుమారైంది..!

నేను ఇదివరకే కర్ణాటక ఎన్నికల్లో సర్వేలు చేశాను. అది అక్షరాలా నిజమైంది. కానీ తెలంగాణలో మాత్రం ఫస్ట్ టైం నా అంచనా తారుమారైంది. దీంతో నేను కూడా ఆలోచనలో పడ్డాను. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారంపై సుధీర్ఘంగా ఆలోచిస్తూ సమాచారం సేకరించాను. అసలేమైందా అని రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు సైతం అనుమానాలు లేవనెత్తారు. ఈవీఎంలలో తేడా ఉందని కొందరు అంటుంటే.. మరికొందరు పోలింగ్ శాతం చెప్పడానికి కూడా ఎన్నికల కమిషన్‌‌కు ఒకటిన్నర రోజు పట్టింది. పోలింగ్ అవ్వగానే 60శాతం.. ఆ తర్వాత 69, 70, 73.2% అని చెప్పడంతో అనుమానాలు మరింత పెరిగాయిఅని ఆంధ్రా ఆక్టోపస్ చెప్పుకొచ్చారు.

ఎందుకిలా జరిగింది..!

అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు, పంచాయితీ ఎన్నికల ఫలితాలపై చాలా తేడా ఉంది. అయితే ఆ ఫలితాలు చూసిన తర్వాత పోటీ చేయడానికి కూడా ఎవరూ ముందుకు రాదేమో అనుకున్నాను. కానీ ఘననీయంగా ప్రతిపక్ష పార్టీ పెరిగింది. వాస్తవానికి వన్‌సైడ్ గెలిచిన ఎన్నికల్లో మళ్లీ నెల రోజుల్లో వచ్చిన ఎన్నికల్లో ప్రతిపక్షాలు నామరూపాల్లేకుండా పోవాలి. కానీ అదేం జరగలేదు.. దీంతో అనుమానాలున్నాయ్.. దీనిపై ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ స్పందించాల్సి ఉందిఅని ఈ సందర్భంగా లగడపాటి తెలిపారు.

అందుకే మీడియా ముందుకొచ్చా!

ఫలితాల తర్వాత నాపై సోషల్ మీడియాలో చాలా మంది దుష్ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు. నాకు చాలా బాదేసింది. పంచాయితీ ఎన్నికల తర్వాత.. వీవీ ప్యాట్ల వ్యవహారం కోర్టుకు వెళ్లిన తర్వాత మాట్లాడదాం అనుకున్నా కానీ.. ఇది ఆలస్యమవుతుందని ఇలా మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. నేను ఎవరి వ్యక్తిని కాదు.. స్వతంత్ర్య వ్యక్తిని.. మాటిస్తే తప్పే మనిషినికాదు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నా తప్పుకున్నా ఈ విషయం మీ అందరికీ తెలుసు. నాకంటూ ఓ మనుసుంది.. వ్యక్తిత్వముందిఅని లగడపాటి చెప్పుకొచ్చారు.

రుజువులున్నాయ్.. బయటపెడతా..!

ఫలితాలు ఎందుకు మారాయ్..? అనే విషయాలను బేరీజు చేశాను. త్వరలోనే ఆ విషయాలన్నీ బయటపెడతాను. మరొక్కసారి నా ఫలితాలతో మీడియా ముందుకొస్తాను. నా విషయాలు కొందరు నమ్మొచ్చు.. నమ్మకపోవచ్చుగానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్లీ నా ఫలితాలు చెబుతాను. ఆ రోజు తేడా రానప్పుడు, డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఎందుకు తేడా వచ్చిందన్నది అప్పడు చెబుతాను. నాకు అనుమానాలే కాదు... నా దగ్గరు రుజువులున్నాయ్. దొంగ సర్వేలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎవరెవరు ఎందుకు ఓడిపోయారో నాకు కారణాలన్నీ తెలుసు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఫలితాలు ఎందుకు తారుమారయ్యాయి అనేది బయటపెడతా.. అని ఆంధ్రా ఆక్టోపస్ చెప్పుకొచ్చారు.

అయితే ఆక్టోపస్ తాజా వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్షాల నేతల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది..? ఇప్పటికే లగడపాటి వ్యవహారంపై కేటీఆర్ తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. అయితే సీఎం కేసీఆర్, హరీశ్, రేవంత్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

More News

వెంక‌టేశ్ ప‌క్క‌న శ్రియ క‌న్ఫ‌ర్మ్‌!

మామాఅల్లుళ్లు 'విక్టరీ' వెంకటేష్, 'యువ సామ్రాట్' అక్కినేని నాగచైతన్య హీరోలుగా నటించనున్న సినిమా 'వెంకీ మామ'.

అన‌సూయ 'క‌థ‌నం' టాకీ పూర్తి స‌మ్మ‌ర్‌లో విడుద‌ల‌

ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం క‌థ‌నం. బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ‌చుక్కా ఈ చిత్రానికి నిర్మాత‌లు.

లక్ష్మీ రాయ్ 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి' షూటింగ్ పూర్తి

లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ' వేర్ ఈజ్ వెంకటలక్ష్మి'.. రామ్ కార్తిక్ , పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ కుమార్ దర్శకత్వం

కంగనాతో మళ్ళీ పని చేయను: క్రిష్

హిందీ న‌టి కంగ‌నా ర‌నౌత్‌తో మ‌ళ్ళీ ప‌ని చేయ‌న‌ని ద‌ర్శ‌కుడు క్రిష్‌ స్పష్టం చేశారు.

"మళ్లీ మళ్లీ చూశా"  సాంగ్ లాంఛ్ చేసిన వి .వి వినాయక్

అనురాగ్ కొణిదెన హీరోగా పరిచయమవుతొన్న చిత్రం "మళ్లీ మళ్లీ చూశా". క్రిషి క్రియేషన్స్ పతాకంపై సాయిదేవ రామన్ దర్శకత్వంలో కొణిదెన కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.