పవన్ గెలుస్తారో..? లేదో..? చెప్పేసిన లగడపాటి
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి రెండు చోట్ల పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే రెండు చోట్లా పవన్ గెలుస్తారా..? లేకుంటే ఒక చోట గెలిచి మరోచోట కష్టమా..? లేదా రెండు చోట్లా ఓడిపోతారా..? ఇలా పెద్ద ఎత్తున బెట్టింగ్స్ నడుస్తున్నాయ్..! మరోవైపు పార్టీ కార్యకర్తలు, అభిమానులు.. పవన్లోనూ ఇదే టెన్షన్ నెలకొంది. పోలింగ్ ముగిసిన తర్వాత చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి.. అయితే పవన్ మాత్రం వాటి గురించి స్పందించకపోవడంతో తనపై తనకే నమ్మకం లేదని అందుకే ఆయన ఇలా చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి.
పవన్ గెలుస్తాడా.. లేదా..?
అయితే తాజాగా.. అసలు పవన్ గెలుస్తారా? లేదా? అన్నది ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పేశారు. శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ రాజకీయాలకు సంబంధించి కొన్ని లీకులు వదిలారు. ఈ సందర్భంగా పవన్ ప్రస్తావన రాగా.. "జనసేన అధినేత పవన్ కల్యాణ్ కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతారు. మెగాస్టార్ చిరంజీవికంటే కొద్దిగా తక్కువగానే ఉంటారు" అని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో మెగాభిమానులు, జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.
అయితే లగడపాటి చెప్పినవన్నీ నమ్మడానికి వీల్లేదని.. తెలంగాణ ఎన్నికల్లో ఆక్టోపస్ సర్వే అట్టర్ ప్లాప్ అయ్యిందని.. ఏపీలో కూడా ఆయన చెప్పింది నమ్మే ప్రసక్తే లేదని కొందరు జనాలు చెప్పుకుంటున్నారు. సో.. ఆదివారం సాయంత్రం పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. అయితే బ్యాలెట్లోని నేతల భవిష్యత్తు మాత్రం ఫైనల్గా మే-23న వెలువడనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments