'లేడీ టైగర్' గా నయనతార

  • IndiaGlitz, [Tuesday,April 24 2018]

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా మలయాళంలో మంచి విజయం సాధించిన ఎలెక్ట్ర చిత్రం తెలుగులో లేడీ టైగర్ పేరుతో విడుదల కానుంది. సురేష్ సినిమా పతాకంపై.. సి.ఆర్.రాజన్ సమర్పణలో.. సురేష్ దూడల ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. శ్రీమతి సరోజ సురేష్ సహ నిర్మాత.

శ్యామ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ మనీషా కొయిరాలా ముఖ్య పాత్ర పోషించగా.. ప్రకాష్ రాజ్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. బిజూ మీనన్ మరో ముఖ్య పాత్రధారి.
రాజశేఖర్ రెడ్డి మాటలు, వెనిజండ్ల శ్రీరామ్మూర్తి పాటలు అందించిన ఈ చిత్రం అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

నిర్మాత సురేష్ దూడల మాట్లాడుతూ.. 'లేడీ సూపర్ స్టార్ నయనతార, మనీషా కొయిరాలా, ప్రకాష్ రాజ్ ల నటన 'లేడీ టైగర్' చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. త్వరలోనే సెన్సార్ చేయించి, విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు!!

More News

'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ కి ముఖ్య అతిధిగా రామ్‌చ‌ర‌ణ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా'.

రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్స్ బ్యాన‌ర్‌లోరూపొందుతోన్న చిత్రం 'ఈ మాయ పేరేమిటో'

ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్.

స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్ టైన్మెంట్ ప్రొడ‌క్ష‌న్ నెం.2కు క్యాస్టింగ్ కాల్..

మ‌ళ్లీరావా లాంటి ఫీల్ గుడ్ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ ఈ మ‌ధ్యే ప్రొడ‌క్ష‌న్ నెం.2ను అనౌన్స్ చేసింది.

'స‌మ్మోహ‌నం' షూటింగ్ పూర్తి

కొత్త అనే ప‌దాన్ని రోజూ విన్నా కొత్త‌గానే ఉంటుంది.  ప్రేమ అనే ప‌దం కూడా అలాంటిదే. త‌ర‌త‌రాలుగా, యుగ‌యుగాలుగా మాన‌వాళికి ప్రేమ‌తో ప‌రిచ‌యం ఉంది.

మ‌హేష్‌.. ఐదేళ్ళ త‌రువాత

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒకే ఏడాదిలో రెండేసి సినిమాల‌తో సంద‌డి చేసిన సంద‌ర్భాలు త‌క్కువ‌నే చెప్పాలి.