క్రీడాకారిణి బయోపిక్ ప్లాన్ చేస్తున్న మహిళా డైరెక్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు ప్రేక్షకులకి బయోపిక్‌లు కొత్తేమీ కాదు. కాకపోతే.. చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల అభిమాన నటి సావిత్రిపై ‘మహానటి’ రూపంలో బయోపిక్ విడుదల కావడంతో.. మరోసారి ఈ బయోపిక్‌ల ట్రెండ్ ఊపందుకుంది. ఇంతవరకు స్వాతంత్య్ర సమరయోధులు, సినీ, రాజకీయ నేతలపై వచ్చిన, వస్తున్న బయోపిక్‌లతో పాటు క్రీడా రంగానికి చెందిన వారి జీవిత కథలు కూడా కార్యరూపం దాల్చనున్నాయి. ఈ నేపథ్యంలో.. ఓ క్రీడాకారిణి బయోపిక్‌కు శ్రీకారం చుట్టనున్నారు మహిళా దర్శకురాలు సంజనా రెడ్డి.
ఆ వివరాల్లోకి వెళితే.. ‘రాజుగాడు’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. మహిళా వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి బయోపిక్ ప్లాన్ చేస్తున్నట్టు సంజనా తెలిపారు. 2000వ సంవత్సరంలో సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్‌లో భారతదేశం తరపున కాంస్య పతకం సాధించి.. దేశం కీర్తితో పాటు తెలుగు వారి ఖ్యాతిని కూడా చాటారు కరణం మల్లేశ్వరి. అలాంటి కరణం మల్లేశ్వరిపై బయోపిక్ రావడం అంటే ఆనందించదగ్గ విషయమే. మరి.. ఇలాంటి ఛాలెంజివ్ పాత్రలో ఎవరు నటిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com