ఒకే కాన్పులో 10 మంది పిల్లలు.. రికార్డు సృష్టించిన మహిళ!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇలాంటి అద్భుతాలు అరుదుగా జరుగుతుంటాయి. ఎవరికైనా కవల పిల్లలు పుడితేనే ఆశర్యపోతుంటాం. అలాంటిది ఓ మహిళ ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మనిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. ఈ అరుదైన సంఘటన సౌత్ ఆఫ్రికాలోని ప్రెటోరియా నగరంలో జరిగింది.
గోసియమే తమారా సితోలే అనే మహిళ ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మనిచ్చి వైద్యులని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. పదిమంది పిల్లల్లో 7 మంది మగబిడ్డలు, ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఆమె గర్భం దాల్చిన తర్వాత పలుమార్లు స్కానింగ్ తీయగా వైద్యులు 6 లేదా 7 మంది పిల్లలు పుడతారని చెప్పారట. కానీ 10 మంది పిల్లలకు జన్మనిచ్చి వైద్యుల లెక్కని కూడా తప్పు చేసింది. ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాక సి- సెక్షన్ చేసి చూడగా 10 మంది శిశువులని చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు.
ప్రస్తుతం పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారు. దీనితో తమారా, ఆమె భర్త ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం పిల్లలని వైద్యులు ఇంక్యుబేటర్ లో ఉంచారు. ఈ వార్త దృవీకరించబడితే ఆమె గిన్నీస్ రికార్డు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. మే నెలలోనే మాలి దేశానికి చెందిన మహిళ ఒకే కాన్పులో 9 మంది పిల్లలకు జన్మనిచ్చింది. సరిగ్గా నెల తర్వాత తమారా ఆ రికార్డుని బ్రేక్ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments