లేడీ కానిస్టేబుల్ హనీ ట్రాప్.. నాలుగో భర్త పోలీసులకు ఫిర్యాదు
Send us your feedback to audioarticles@vaarta.com
వృత్తి పరంగా ఆమె ఒక కానిస్టేబుల్.. ప్రవృత్తి డబ్బున్న వారిని పెళ్లి పేరుతో మోసం చేయడం.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. నలుగురిని వివాహం చేసుకుంది. ఇంకా ఆమె లిస్టులో బాధితులు ఎంత మంది ఉన్నారో తెలియాల్సి ఉంది. ఒక బాధితుడు ఆన్లైన్ ద్వారా చేసిన ఫిర్యాదుతో అసలు విషయం వెలుగు చూసింది. ప్రేమ పేరుతో పెళ్లి కానీ మగవారిని హనీ ట్రాప్ చేసి వరుస పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దోచుకుంటోందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Also Read: తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందజేసిన నిధి
ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న సంధ్యారాణిపై తాజాగా కేసు నమోదైంది. షాబాద్ మండలం, హైతబాద్‌కు చెందిన చరణ్ తేజ అనే యువకుడు శంషాబాద్ డీసీపీ, షాబాద్ పోలీస్ స్టేషన్, సోషల్ మీడియా నంబర్లకు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. సంధ్యారాణి ప్రేమ పేరుతో పెళ్లి కానీ మగవారిని హనీ ట్రాప్ చేసి వరుస పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దోచుకుంటోందని చరణ్ తేజ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసు శాఖలో పనిచేస్తున్నానని చెప్పి బాగా డబ్బున్న వారికి వల వేసి మోసం చేస్తోందని, ఇదేమీ ఆమెకి కొత్త కాదని సదరు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గతంలోనూ ఇలాగే ముగ్గురు వ్యక్తులను హనీ ట్రాప్ చేసి వివాహం చేసుకుందని చరణ్ తేజ్ వెల్లడించాడు. వారిలో ఇద్దరికి విడాకులు ఇవ్వగా, మరొకరు ఆమె వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని బాధితుడు పోలీసులకు తెలిపాడు.
తాను ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చానని.. ప్రేమ పేరుతో తనను మోసం చేసిందని వెల్లడించాడు. పెళ్లికి ఒప్పుకోకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు పెట్టడం కానీ.. లేదంటే ఇద్దరం కలిసి తిరిగిన ఫోటోస్, వీడియోస్ లీక్ చేస్తానని బెదిరించిందని.. దీంతో తాను వివాహం చేసుకోవాల్సి వచ్చిందని చరణ్ తేజ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ తర్వాతే ఆమెకు గతంలోనే మూడు వివాహాలు జరిగిన విషయం తెలిసిందన్నాడు. సంధ్యారాణిని అలాగే వదిలేస్తే మరింత మందిని మోసం చేస్తుందని వాపోయాడు. ఆమె బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే బయటికి రావాల్సిందిగా సోషల్ మీడియా ద్వారా చరణ్ తేజ్ విజ్ఞప్తి చేశాడు. కాగా.. ఈ వరుస పెళ్లిళ్ల వ్యవహారంపై సంధ్యారాణిపై గతంలోనే సదరు యువతిపై ఓ కేసు కూడా నమోదైనట్టు తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com