బంగార్రాజు : ఆకట్టుకుంటున్న “లడ్డుందా” లిరికల్ సాంగ్... నాగ్ గాత్రంతో మాస్‌కు పూనకాలే

  • IndiaGlitz, [Tuesday,November 09 2021]

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, రమ్యకృష్ణ కలసి నటించిన ‘‘ సోగ్గాడే చిన్నినాయన’’ సినిమాతో చేసిన మ్యాజిక్ అందరికీ తెలిసిందే. మరోసారి బంగార్రాజు పాత్రలో రమ్యకృష్ణతో కలిసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు కింగ్ రెడీ అవుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయనతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించిన కళ్యాణ్ కృష్ణ ఈ ప్రీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈసారి నాగచైతన్య, కృతి శెట్టిలు కూడా బంగార్రాజుతో కలిసి సందడి చేయనున్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లి., జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మనం, సోగ్గాడే చిన్ని నాయన చిత్రాలతో అక్కినేని అభిమానులకు అనూప్ ఫేవరేట్‌గా మారిపోయాడు. అందుకే బంగార్రాజుకు కూడా అనూప్‌నే ఫిక్స్ చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘‘లడ్డుందా’’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇందులో బంగార్రాజు స్వర్గంలో ఉన్నట్టు కనిపిస్తోంది. అక్కడ కూడా ఆయన తన సరసాలను వదిలిపెట్టనట్టు కనిపిస్తోంది. అక్కడి దేవ కన్యలతో సరసాలు ఆడుతున్నట్టున్నాడు. నాగ్ స్వయంగా పాటను పాడాడు. ఆయన గాత్రంతో ఈ సాంగ్ స్టైల్‌గా మారింది. పాట మొదట్లో ‘‘ బాబు త‌బ‌లా..అబ్బాయి హార్మోని..తాన న న న న..డాంట‌కు డ‌డ‌నా..అంటూ నాగార్జున గోదావరి యాస డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. “బంగార్రాజు” కొత్త షెడ్యూల్ ఈ రోజు మైసూర్‌లో స్టార్ట్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

More News

'విలనిజం నేనెప్పుడో చేసి వదిలేశా '.. ఆకట్టుకుంటోన్న గోపీచంద్ పక్కా కమర్షియల్ టీజర్

కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే హీరో గోపీచంద్. ఈయన తాజాగా నటిస్తున్న సినిమా ‘‘ పక్కా కమర్షియల్ ’’.

అల్లు అయాన్ స్ట‌న్నింగ్ వీడియో.. అచ్చం తండ్రిలాగే చింపి ఆరేశాడుగా..!

మెగాస్టార్ చిరంజీవి వేసిన విత్తనం నుంచి ఒక మహా వృక్షంలా మారింది మెగా ఫ్యామిలీ.

'జీ 5' ఒరిజినల్ సిరీస్ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' (OCFS) ట్రైలర్ విడుదల చేసిన కింగ్ నాగార్జున

వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు, ఒరిజిన‌ల్ మూవీస్‌, డిజిట‌ల్ రిలీజ్‌లు... ఏవి చూడాలని అనుకున్నా ప్రజల ఫస్ట్ ఆప్షన్ 'జీ 5'.

కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తో నవంబర్ 19 న విడుదలవుతున్న 'స్ట్రీట్ లైట్' మూవీ

మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో

పూరి జగన్నాథ్ చేతుల మీదుగా బండ్ల గణేష్ 'డేగల బాబ్జీ' ట్రైలర్ విడుదల

ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'డేగల బాబ్జీ'.