బంగార్రాజు : ఆకట్టుకుంటున్న “లడ్డుందా” లిరికల్ సాంగ్... నాగ్ గాత్రంతో మాస్‌కు పూనకాలే
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, రమ్యకృష్ణ కలసి నటించిన ‘‘ సోగ్గాడే చిన్నినాయన’’ సినిమాతో చేసిన మ్యాజిక్ అందరికీ తెలిసిందే. మరోసారి బంగార్రాజు పాత్రలో రమ్యకృష్ణతో కలిసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు కింగ్ రెడీ అవుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయనతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించిన కళ్యాణ్ కృష్ణ ఈ ప్రీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈసారి నాగచైతన్య, కృతి శెట్టిలు కూడా బంగార్రాజుతో కలిసి సందడి చేయనున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లి., జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మనం, సోగ్గాడే చిన్ని నాయన చిత్రాలతో అక్కినేని అభిమానులకు అనూప్ ఫేవరేట్‌గా మారిపోయాడు. అందుకే బంగార్రాజుకు కూడా అనూప్‌నే ఫిక్స్ చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘‘లడ్డుందా’’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇందులో బంగార్రాజు స్వర్గంలో ఉన్నట్టు కనిపిస్తోంది. అక్కడ కూడా ఆయన తన సరసాలను వదిలిపెట్టనట్టు కనిపిస్తోంది. అక్కడి దేవ కన్యలతో సరసాలు ఆడుతున్నట్టున్నాడు. నాగ్ స్వయంగా పాటను పాడాడు. ఆయన గాత్రంతో ఈ సాంగ్ స్టైల్‌గా మారింది. పాట మొదట్లో ‘‘ బాబు తబలా..అబ్బాయి హార్మోని..తాన న న న న..డాంటకు డడనా..అంటూ నాగార్జున గోదావరి యాస డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. “బంగార్రాజు” కొత్త షెడ్యూల్ ఈ రోజు మైసూర్‌లో స్టార్ట్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com