అప్రమత్తంగా లేకపోవడం కూడా హానికరమే: వెంకీ కుడుమల
Send us your feedback to audioarticles@vaarta.com
‘భీష్మ’ డైరెక్టర్ వెంకి కుడుములను ఇటీవల ఒక మోసగాడు మోసగించిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల చాలా కథనాలు వెలువడ్డాయి. తాజాగా వెంకి కుడుముల ఈ అంశంపై ట్విటర్ వేదికగా స్పందించారు. అసలు ఆ రోజు ఏం జరిగిందనేది ఆయన వెల్లడించారు. ‘‘ఇది నాతరుఫు స్టోరీ.. నిజమైన స్టోరీ.. ‘‘ఇటీవల వస్తున్న ఊహాగానాలు.. రెండు రోజుల క్రితం నేను చేసిన పోలీస్ కంప్లైంట్ గురించి నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మేము సైలెంట్‌గా ఉంటే దాని గురించి ఎవ్వరికీ తెలియదు. లేదంటే మేము గొంతు విప్పతే అది ఎవరికీ జరగలేదనా? అసలు ఏం జరిగిందంటే..
మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా నాకు నవీన్ అనే వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అతనికి నేను రూపొందించిన ‘భీష్మ’ సినిమా చాలా ఇష్టం. అది ఆర్గానిక్ ఫార్మింగ్‌ని డీల్ చేస్తుంది కాబట్టి ఈ సినిమాను నేషనల్ అవార్డుకు అప్లై చేయమని కోరాడు. అలా అప్లై చేయడంలో తప్పు లేదనిపించి నేను ముందుకెళ్లా. నాకు నవీన్ రెండేళ్లుగా తెలుసు అన్న ఒక మ్యూచువల్ ఫ్రెండ్‌తో నేను టచ్‌లో ఉన్నాను. కావల్సిన డాక్యుమెంట్స్‌ను రెడీ చేయమని అసోసియేట్ డైరెక్టర్‌కు చెప్పా. అప్లికేషన్ ఫీ కింద రూ.63,600 చెల్లించాను. మళ్లీ నవీన్ నాతో ఒక చిన్న తప్పిదం జరిగిందని తిరిగి డబ్బులు పంపాలని కోరాడు. దీంతో నాకు అనుమానం కలిగింది. వెంటనే బ్యాంకు డీటైల్స్‌ను చెక్ చేశా. బహుశా అది ఫిల్మ్ కార్పోరేషన్ అకౌంట్ నంబర్ కాదు.. ఏదో సెల్ఫ్ నంబర్ అయి ఉంటుందన్న అనుమానం కలిగింది. వెంటనే నా స్నేహితుడిని పిలిచి నవీన్ గురించి మరింత సమాచారం అడిగాను. తను ఎప్పుడూ నవీన్‌ను చూడలేదని.. రెండేళ్లలో అడపా దడపా మెసేజ్‌లు వచ్చాయని నా స్నేహితుడు నాకు చెప్పాడు.
ఇలాంటి మోసగాళ్లు మన వద్దకు ఏదో ఒక రూపంలో వస్తుంటారు. చాలా మంది నా ఫ్రెండ్స్ అతని పైన కంప్లైంట్ చేయవద్దని సైలెంట్‌గా ఉండిపొమ్మని సలహా ఇచ్చారు. కానీ దానికి నేను ఒప్పుకోలేదు. నేను కంప్లైంట్ చేశాను. ఎందుకంటే ఇలా నన్ను మోసం చేసినట్టు మోసగాళ్లు.. ఇండస్ట్రీలో కానీ బయట సమాజంలో కానీ మరెవ్వరినీ మోసగించకూడదు. తప్పు జరిగితే, ఇలా తప్పు జరిగింది ఇలా మిగతా వాళ్లకు జరగకూడదు అని కంప్లైంట్ చేయడంలో తప్పు లేదనిపించింది.
పొగ తాగుట, మద్యం సేవించుటే కాదు.. అప్రమత్తంగా లేకపోవడం కూడా హానికరమే. సమాజంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు గొంతు విప్పాలని మీ అందరినీ అర్థిస్తున్నా’’ అని వెంకి కుడుముల వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments