లచ్చిందేవికి ఓ లెక్కుంది రిలీజ్ డేట్ ఫిక్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న తాజా చిత్రం లచ్చిందేవికి ఓ లెక్కుంది. ఈ చిత్రాన్ని దర్శకధీర రాజమౌళి శిష్యుడు జగదీష్ తెరకెక్కించారు. సాయి ప్రసాద్ కామినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందించారు. అందాల రాక్షసి జంట నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి మళ్లీ కలసి నటించడంతో లచ్చిందేవికి ఓ లెక్కుంది మూవీపై పాజిటివ్ టాక్ ఉంది. దీనికి తోడు ఫస్ట్ లుక్, ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. వైవిధ్యమైన ఈ చిత్రాన్ని డిసెంబర్ 11న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి...అందాల రాక్షసి పెయిర్ ఈసారి ఎలాంటి ఫలితాన్ని సాధిస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments