ల‌చ్చిందేవికి టైటిల్ వెనుక అస‌లు కథ ఇది...

  • IndiaGlitz, [Tuesday,January 26 2016]

న‌వీన్ చంద్ర‌, లావ‌ణ్య న‌టించిన చిత్రం ల‌చ్చిందేవికి ఓ లెక్కుంది చిత్రం జ‌న‌వ‌రి 29న విడుద‌ల‌వుతుంది. ఇండియ‌న్ ఎకాన‌మీలో బ్యాంకుల్లో లెక్క‌లోకి రాని డ‌బ్బులు వేల కోట్లు ఉన్నాయి. అటువంటి డ‌బ్బును కొట్టేయాల‌నుకునే ఓ బ్యాచ్‌తో హీరో, హీరోయిన్‌కు ఉన్న రిలేష‌న్ ఏంటనే కాన్సెప్ట్‌తో సినిమా న‌డుస్తుంది.

ఈ సినిమాలో లావ‌ణ్య త్రిపాఠి ఉమాదేవి, అంకాల‌మ్మ అనే క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపిస్తుంది. అందువ‌ల్ల సినిమాకు యు/ఎ అనే టైటిల్‌ను పెడ‌దామ‌నుకున్న ద‌ర్శ‌క నిర్మాత‌లు చివ‌ర‌కు సెన్సార్‌కు జ‌డిసి ల‌చ్చిందేవికి ఓ లెక్కుంది అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు.