'లచ్చిందేవికి ఓ లెక్కుంది' రిలీజ్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా మయూఖ క్రియేషన్స్ బ్యానర్ పై జగదీశ్ తలశిల దర్శకత్వంలో సాయి ప్రసాద్ కామినేని నిర్మించిన చిత్రం 'లచ్చిందేవికి ఓ లెక్కుంది. కామెడి ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించారు. అందాల రాక్షసి తర్వాత నవీన్‌చంద్ర, లావణ్యలు కలిసి నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఉన్నాయి.
ఎందుకంటే అందాల రాక్షసి` తర్వాత నవీన్‌కు ఆ రేంజ్ గుర్తింపు తెచ్చిన చిత్రం లేదు. లావణ్య మాత్రం భలే భలే మగాడివోయ్`తో సక్సెస్ అందుకుంది. నిజానికి ఈ సినిమాను జనవరి 1న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ సినిమాల మధ్య బారీ పోటీ ఉండటంతో సినిమాను జనవరి 29న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు వీరి కాంబినేషన్ రెండోసారి సక్సెస్ అందుకుంటుందా లేదో చూద్దాం..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments