‘‘ క్యాష్ లేని లైఫ్ కష్టాల బాత్ టబ్బో’’ : ఎఫ్ 3 మూవీ నుంచి 'లబ్ డబ్ ' సాంగ్ రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాణంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’ మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. చాలా యేళ్ల తర్వాత వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చింది ఎఫ్ 2. అటు వరుణ్ తేజ్ కెరీర్లో కూడా ఇదే పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించింది. వరుసగా ఐదు హిట్ల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమాను తెరకెక్కిస్తున్నారు అనిల్. తమన్నా, మెహరీన్ కౌర్, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా... రాజేంద్ర ప్రసాద్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ నేపథ్యంలో ఎఫ్ 3 నుంచి ఓ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఎఫ్2లో ప్రేమ, పెళ్లి, భార్య, ప్రియురాలి చుట్టూ కథ తిరుగుతుంది. ఎఫ్ 3లో మాత్రం డబ్బు చుట్టూ నడుస్తుందట. ఈ నేపథ్యంలో డబ్బు గురించి చెబుతూ ఈ పాటలో వివరించారు. 'లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు... ఎవడు కనిపెట్టాడో గానీ దీన్ని అబ్బో!క్యాష్ లేని లైఫ్ కష్టాల బాత్ టబ్బో... పైసా ఉంటే లోకమంతా పెద్ద డాన్స్ క్లబ్బో' అంటూ ఈ సాంగ్ సాగుతుంది. వరుణ్ తన శిష్యులతో డ్యాన్స్ చేస్తున్న స్వామీజీని పోలిన గెటప్‌లో సరికొత్తగా కన్పించాడు. ఈ పాటను భాస్కరభట్ల రచించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రామ్ మిరియాల ఆలపించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments