close
Choose your channels

'లాల్‌ సింగ్‌ చద్దా'కు గుమ్మడి కాయ కొట్టిన చిత్రయూనిట్, రిలీజ్‌ ఎప్పుడంటే..?

Saturday, September 18, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లాల్‌ సింగ్‌ చద్దాకు గుమ్మడి కాయ కొట్టిన చిత్రయూనిట్, రిలీజ్‌ ఎప్పుడంటే..?

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. కరీనా కపూర్ జంటగా నటించిన ‘లాల్‌ సింగ్‌ చద్దా’ షూటింగ్‌ శుక్రవారంతో పూర్తయింది. టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగచైతన్య ఈ చిత్రంతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. కామెడీ- డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. షూటింగ్‌ ఆఖరిరోజున ఆమిర్‌ఖాన్‌, చిత్రబృందంతో కేక్‌ కట్‌ చేస్తూ సందడి చేశారు.

లాల్‌ సింగ్‌ చద్దాకు గుమ్మడి కాయ కొట్టిన చిత్రయూనిట్, రిలీజ్‌ ఎప్పుడంటే..?

హీరోయిన్‌ కరీనా కపూర్‌ ‘లాల్‌ సింగ్‌’ తనకెంతో ప్రత్యేమని గతంలోనే పంచుకున్నారు. అయితే ‘‘లాల్‌ సింగ్‌ చద్దా షూటింగ్‌ వేళ ఎన్నో సమస్యలు ఒకేసారి వచ్చిపడ్డాయి. మహమ్మారి కరోనా ఉండటం, తాను రెండోసారి గర్భం దాల్చడంతో ఒకింత భయానికి గురయ్యా. అయితే ఇవేవీ షూటింగ్‌ పై తనకున్న ఆసక్తిని ఆపలేదని. ఇక చిత్రీకరణ జరిగేంత వరకూ జాగ్రత్త చర్యలు పాటించాం’’ అని అభిమానులతో పంచుకున్నారు కరీనా.

లాల్‌ సింగ్‌ చద్దాకు గుమ్మడి కాయ కొట్టిన చిత్రయూనిట్, రిలీజ్‌ ఎప్పుడంటే..?

దేశవ్యాప్తంగా వందకుపైగా లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. వాటిలో తెలుగు రాష్రాల్లోని కాకినాడ, అమలాపురం, హైదరాబాద్‌ లొకేషన్లు కూడా ఉన్నాయి. 170 రోజులు షూటింగ్‌ జరిపారు. లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల చిత్రీకరణ ఆలస్యమైంది. 1994 హాలీవుడ్‌లో విజయవంతమైన ‘ఫారెస్ట్‌ గంప్‌’కి ఇది రీమేక్‌గా రూపొందుతోంది. ఆస్కార్ విజేత టామ్ హాంక్స్ ప్రధాన పాత్రలో నటించారు. ‘లాల్ సింగ్ చద్దా’ 2019 అక్టోబర్ 31న చంఢీగఢ్‌లో ప్రారంభమైంది. కొవిడ్ మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్‌ 2020 మార్చిలో నిలిపివేశారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న సినిమా చూడాలంటే 2021 క్రిస్మస్‌ వరకూ ఆగాల్సిందే!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment