విజయవాడలో 'ఎల్7' టీమ్ హల్ చల్
Send us your feedback to audioarticles@vaarta.com
రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై ఆదిత్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఎల్ 7'. పూజా జావేరి కథానాయిక. ముకుంద్ పాండే దర్శకుడు. బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మాత. శుక్ర, శని, ఆదివారాల్లో ఈ చిత్రం టీమ్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో పలు కాలేజ్‌లను సందర్శించి బ్లడ్ క్యాంపులను నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం విజయవాడలో హల్ చేశారు.
దీని గురించి నిర్మాత మాట్లాడుతూ ''శనివారం విజయవాడలోని పలు ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులను నిర్వహించాం. అక్కడి ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వచ్చింది. ఇక సినిమా విషయానికొస్తే... లవ్, కామెడీ, హారర్ అంశాలతో ఏడు భిన్న కథలతో రూపొందుతున్న చిత్రమిది. ప్రేమలో ఏడు కోణాల్ని చూపించే ప్రయత్నం చేశాం. ఆదిత్‌కు కరెక్ట్‌గా యాప్ట్ అయ్యే కథ ఇది. అతని క్యారెక్టర్ సినిమాకు హైలైట్ అవుతుంది. పూజా నటనకు ప్రాధాన్యమున్న పాత్ర చేస్తుంది. ఇటీవల విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌లకు చక్కని స్పందన వచ్చింది. పాటలు కూడా అదే రీతిలో ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నాం. త్వరలో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి నెలాఖరులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అని తెలిపారు.
ఈ చిత్రానికి కెమెరా: దుర్గాప్రసాద్, సంగీతం: అరవింద్ శంకర్, ఆర్ట్: నాగసాయి, సమర్పణ: మాస్టర్ ప్రీతమ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్, కో.ప్రొడ్యూసర్: బి.మోహనరావు, సతీష్ కొట్టె.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com