చిత్రీకరణ చివరి దశలో 'ఎల్7'

  • IndiaGlitz, [Monday,April 04 2016]

రాహుల్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఆదిత్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఎల్‌ 7'. పూజా జావేరి కథానాయిక. 'ఇష్క్‌', గుండెజారి గల్లంతయ్యిందే', 'మనం' చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ విభాగాల్లో పనిచేసిన ముకుంద్‌ పాండే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'ఈవర్షం సాక్షిగా' వంటి హిట్‌ చిత్రాన్ని అందించిన బి.ఓబుల్‌ సుబ్బారెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ పూర్తయింది.

నిర్మాత మాట్లాడుతూ ''లవ్‌, కామెడీ, హారర్‌ అంశాలతో ఏడు భిన్న కథలతో రూపొందుతున్న చిత్రమిది. దర్శకుడు ఎంచుకున్న కథ బలమైనది. ఆదిత్‌కు కరెక్ట్‌గా యాప్ట్‌ అయ్యే కథ ఇది. అతని క్యారెక్టర్‌ సినిమాకు హైలైట్‌ అవుతుంది. పూజా నటనకు ప్రాధాన్యమున్న పాత్ర చేస్తుంది. ఇటీవల హైదరాబాద్‌లో భారీ ప్రాంతాల్లో ఓ షెడ్యూల్‌ పూర్తి చేశాం. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు షూటింగ్‌ లొకేషన్‌కి వచ్చి 'ఎల్‌7' టైటిల్‌ ఆసక్తికరంగా ఉందని చెప్పి, కథ గురించి ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకోవడం విశేషం. సోమవారం నుంచి వైజాగ్‌లో చేసే షెడ్యూల్‌తో షూటింగ్‌ పూర్తవుతుంది. నిర్మాణపరంగా ఎక్కడా రాజీపడడంలేద. మా బ్యానర్‌లో మంచి సినిమా అవుతుంది'' అని తెలిపారు.

ఈ చిత్రానికి కెమెరా: దుర్గాప్రసాద్‌, సంగీతం: అరవింద్‌ శంకర్‌, ఆర్ట్‌: నాగసాయి, సమర్పణ: మాస్టర్‌ ప్రీతమ్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌, కో.ప్రొడ్యూసర్‌: బి.మోహనరావు, సతీష్‌ కొట్టె.

More News

చరణ్ కోసం సింగర్ గా మారిన కొరియోగ్రాఫర్

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ రాంచరణ్ కోసం సింగర్ అవతారం ఎత్తాడు.

కందిరీగ కాంబినేష‌న్ లో సినిమా

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ - సంతోష్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందిన కందిరీగ సినిమా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించిన విష‌యం తెలిసిందే. ఆత‌ర్వాత సంతోష్ శ్రీనివాస్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో ర‌భ‌స సినిమా చేసాడు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.

ఏడెనిమిది సంవత్సరాల్లో 'ఊపిరి' లాంటి గొప్ప సినిమా నేను చూడలేదు - మెగా ప్రొడ్యూసర్‌ సి.అశ్వనీదత్‌ 

కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మించిన ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'ఊపిరి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా అఖండ విజయం సాధించి యు.ఎస్‌.లో 2 మిలియన&

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విశాఖపట్నంలో సరైనోడు ఆడియో సెలబ్రేషన్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ లో అత్యంతభారీగా నిర్మించిన సరైనోడు చిత్రం ఆడియో ఏప్రిల్ 1న విడుదలయ్యి అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పోందుతుంది.

ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించిన ప్రియాంక చోప్రా..

అందం - అభిన‌యం తో పాటు ఆత్మ‌విశ్వాసాని మ‌రో పేరులా ఉండే బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా...ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించిందా..? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు సార్లు ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించింద‌ట ప్రియాంక‌.