తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న తుఫాన్ గండం!
Send us your feedback to audioarticles@vaarta.com
అరేబియాలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్రమైన ‘క్యార్రా’ తుఫాన్‌గా మారింది. ఈ తుఫాను ప్రభావంతో కర్నాటక, మహారాష్ట్ర, గోవా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పినప్పటికీ ఇవాళ మాత్రం వర్షాలు పడలేదు. 24 గంటల్లో ఉత్తర, దక్షిణ గోవా జిల్లాలు, మహారాష్ట్రలోని రత్నగిరి, సింధూదుర్గ్, కర్ణాటకలోని తీర, ఉత్తర ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
అయితే ఈ తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడింది. రానున్న 24 గంటల్లో ఈ తుఫాన్ తీవ్ర రూపం దాల్చుతుందని.. దాని ప్రభావంతో గంటకు 85 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముంబైకు దక్షిణాన 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుఫాన్.. రత్నగిరికి పశ్చిమాన 200 కిలోమీటర్ల దూరంలో భీకర రూపం దాల్చనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout