తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న తుఫాన్ గండం!

  • IndiaGlitz, [Monday,October 28 2019]

అరేబియాలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్రమైన ‘క్యార్రా’ తుఫాన్‌గా మారింది. ఈ తుఫాను ప్రభావంతో కర్నాటక, మహారాష్ట్ర, గోవా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పినప్పటికీ ఇవాళ మాత్రం వర్షాలు పడలేదు. 24 గంటల్లో ఉత్తర, దక్షిణ గోవా జిల్లాలు, మహారాష్ట్రలోని రత్నగిరి, సింధూదుర్గ్, కర్ణాటకలోని తీర, ఉత్తర ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

అయితే ఈ తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడింది. రానున్న 24 గంటల్లో ఈ తుఫాన్ తీవ్ర రూపం దాల్చుతుందని.. దాని ప్రభావంతో గంటకు 85 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముంబైకు దక్షిణాన 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుఫాన్.. రత్నగిరికి పశ్చిమాన 200 కిలోమీటర్ల దూరంలో భీకర రూపం దాల్చనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

More News

ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా..: స్టార్ హీరోయిన్

అవును మీరు వింటున్నది నిజమే.. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందని టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లలో ఒకరైన కాజల్ అగర్వాల్ తన మనసులోని మాటను బయటపెట్టింది.

‘23 సీట్లు ఖాళీ అవుతాయ్.. టీడీపీ ఉంటుందో.. ఊడిపోతుందో’!

ఏపీ ప్రభుత్వం కృత్రిమ ఇసుక కొరత సృష్టిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ ఇద్దరూ కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని..

డైరెక్ట‌ర్ అవుతానంటున్న ప‌వ‌న్ కుమార్తె

మెగా ఫ్యామిలీ నుండి ఇప్ప‌టికే దాదాపు డ‌జ‌ను మంది హీరోలు ఇండ‌స్ట్రీలో ఉన్నారు.

కీర్తి సురేష్ సినిమా టైటిల్?

`మ‌హాన‌టి`తో జాతీయ ఉత్త‌మ‌న‌టిగా అవార్డును సొంతం చేసుకున్న కీర్తి సురేశ్ ఇప్పుడు సినిమాల ఎంపిక‌లో అచితూచి వ్య‌వ‌హ‌రిస్తుంది.

వైసీపీకి ఊహించని షాక్.. గుడ్ బై చెప్పిన ‘దగ్గుబాటి’

ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం నాడు టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ