Prajagalam:కూటమి 'ప్రజాగళం' సభ అట్టర్ ఫ్లాప్.. వైసీపీ నేతల విమర్శలు..

  • IndiaGlitz, [Monday,March 18 2024]

టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి చిలలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సభ అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి రాష్ట్రాన్ని మోదీకి తాకట్టు పెట్టాలనుకుంటున్నారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. ఏకంగా ప్రధానమంత్రి వచ్చిన సభలో మైకులు పనిచేయలేదని.. పరిస్థితులు, దేవుడు కూడా వారి పక్షాన లేరన్నారు. రాష్ట్రానికి బీజేపీ తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు.

గతంలో చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అనరాని మాటలు అన్నారు. రాష్ట్రానికి మోదీ ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? విలువలు విశ్వసనీయత అనే పదాలకు అర్థం చంద్రబాబు జీవితంలో తెలుసుకోలేరు. పవన్ కల్యాణ్, చంద్రబాబు రాష్ట్రం కోసం ఆలోచించే వ్యక్తులు కాదు. విభజన హామీలను ఇంకా అమలు చేయలేదు. మోసం చేయడం అనేది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.

మూడు పార్టీల ఉమ్మడి సభ జనం లేక వెలవెలబోయిందని మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. అసలు బీజేపీ, టీడీపీ, జనసేన ఎందుకు కలిశాయో చెప్పాలని ప్రశ్నించారు. ప్రధాని మోదీని బతిమిలాడి మరీ చంద్రబాబు పొత్తు కుదుర్చుకున్నారని ఆరోపించారు. సభలో దేశ ప్రధాని మాట్లాడుతున్న మైక్ ఆగిపోయిందని.. సభను జరపడం చేతకాని వారు అంటూ విమర్శించారు. అమరావతి, పోలవరం అవకతవకలపై విచారణ జరిపిస్తామని.. ఎందుకు జరిపించలేదని.. ఇదేనా మీ నిబద్దత అని మోదీని నిలదీశారు. వైసీపీ, కాంగ్రెస్ ఒక్కటేనని మోదీ అంటున్నారని.. ఆయన మాటలు ఎవరైనా నమ్ముతారా? అన్నారు.

కాగా చిలకలూరిపేట బొప్పూడిలో ఆదివారం సాయంత్రం ప్రజాగళం పేరుతో టీడీపీ-బీజేపీ-జనసేన బహిరం సభ నిర్వహనించిన సంగతి తెలిసిందే. ఈ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ఆశీనులయ్యారు. ఈ సభా వేదికగా వైసీపీ ప్రభుత్వంపై మోదీ విమర్శలు చేశారు. సీఎం జగన్, మంత్రలు అవినీతిలో కూరుకుపోయారని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక చంద్రబాబు, పవన్ కూడా వైసీపీని గద్దె దించాల్సి సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, ఏకంగా ప్రధాని మోదీ జగన్ ప్రభుత్వంపై అవినీతి విమర్శలు చేయడం రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి.

More News

Kavitha:సుప్రీంకోర్టులో కవిత పిటిషన్.. అక్రమంగా అరెస్ట్ చేశారని ఫిర్యాదు..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

Tamilisai:బ్రేకింగ్: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తన పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామా లేఖను పంపించారు.

Hanuman:ZEE5లో సెన్సేష‌న‌ల్ పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ ‘హను-మ్యాన్’ స్ట్రీమింగ్‌

తెలుగువారికే కాదు అన్ని భాషల వారికి వైవిధ్యమైన కథలను అందించడంలో ముందు ఉంటుంది ఓటీటీ ప్లాట్ ఫామ్ ZEE5.

Kavitha:కవితకు భారీ షాక్.. వారం రోజుల రిమాండ్ విధించిన కోర్టు..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ షాక్ తగిలింది. ఆమెను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతిస్తూ ఆదేశాలు

YCP:వైసీపీ అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట.. సామాజిక న్యాయం అంటే ఇదే..

వైనాట్ 175 నినాదంతో ఎన్నికల బరిలో దిగుతున్న వైసీపీ అందుకు తగ్గట్లే అభ్యర్థులను ఎంపిక చేసింది.