కాంగ్రెస్ పార్టీకి ఖుష్బూ రాజీనామా.. మధ్యాహ్నం బీజేపీలో చేరిక..
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఖుష్బూ సోమవారం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఖుష్బూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి సోమవారం పంపించారు. తొలుత ఖుష్బూను పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతోందంటూ జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి అధిష్టానం తొలగించింది. అనంతరం ఆమె పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలోని ఉన్నత స్థాయిలో ఉన్న కొందరు నేతలు వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. ప్రజలతో సంబంధం లేని వారు పార్టీ కోసం పనిచేస్తున్న తనలాంటి వారిని అణచివేస్తున్నారని ఖుష్బూ సోనియాకు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
2014 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, తాను ప్రజా సేవ కోసం పనిచేసేందుకు పార్టీలో చేరానే కానీ.. పేరు, ప్రతిష్ఠ కోసం కాదని ఖుష్బూ లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఖుష్బూ ప్రకటించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సోమవారం మధ్యాహ్నం ఆమె కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. దీని కోసం ఆదివారం రాత్రి ఆమె ఢిల్లీ చేరుకుని... ఇప్పటికే బీజేపీ పెద్దలతో మాట్లాడి లైన్ క్లియర్ చేసుకున్నారు. ఖుష్బూ 2010లో అప్పటి తమిళనాడు అధికార పార్టీ డీఎంకేలో చేరారు. 2014 ఎన్నికల సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీలో ఆమెకు ఎలాంటి పదవీ దక్కలేదు. దీంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ కోసం పట్టుబట్టినప్పటికీ అది కూడా డీఎంకే-కాంగ్రెస్ పొత్తు నేపథ్యంలో సీట్లు సర్దుబాటు కారణంగా దక్కలేదు. రాజ్యసభకు పంపిస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినా.. అది కూడా నెరవేరలేదు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన కుష్బు పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంపై ప్రశంసలు కురిపించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఆది నుంచి సినీ నటులకు అండగా నిలుస్తున్న కమల దళం ఖుష్బూకి కూడా సముచిత స్థానాన్ని కల్పించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com