మోదీజీ.. మమ్మల్నీ గుర్తించండి : ఖుష్బూ
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రధాని నరేంద్ర మోదీ కొన్నిరోజుల క్రితం బాలీవుడ్ తారలకు తన నివాసంలో ఇచ్చిన ఆతిథ్యంతో ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో రచ్చ రచ్చ అవుతోంది. అయితే దక్షిణాది సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక్కరికీ పిలుపు రాకపోవడం.. కనీసం పట్టించుకోకపోవడంతో సినీ పెద్దలు, నటీనటులు ఆగ్రహం రగిలిపోతున్నారు. ఇప్పటికే పలువురు నటులు సోషల్ మీడియా వేదికగా ప్రధాని వైఖరిపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. అపోలో ఫౌండేషన్ అధినేత ఉపాసన కొణిదెల ఈ విషయమై మోదీపై ప్రశ్నల వర్షం కురిపించారు.
మమ్మల్ని ఎందుకు పిలవలేదు మోదీ..!
అయితే తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ నటి, కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత ఖుష్బూ స్పందిస్తూ.. మోదీకి సూటి ప్రశ్న సంధించారు. దక్షిణాది తారలను కూడా గుర్తించాలని.. భారత చలనచిత్ర రంగం అంటే హిందీ సినిమా రంగం ఒక్కటే కాదన్న విషయాన్ని ప్రధానమంతి కార్యాలయం గుర్తించాలని హితవు పలికారు. ‘భారత ఆర్థిక వ్యవస్థకు బాలీవుడ్ ఒక్కటే ఆదాయం అందిట్లేదు.. దక్షిణాది చిత్రపరిశ్రమల నుంచి కూడా భారీగా తోడ్పాటు అందుతోంది. ఎంతోమంది సూపర్ స్టార్లు, టెక్నీషియన్లు దక్షిణాది చిత్ర పరిశ్రమల నుంచి వచ్చారు. ఎందుకు 'చేంజ్ విత్ ఇన్' కార్యక్రమానికి దక్షిణాది ప్రముఖులను పిలవలేదు. ఇది దక్షిణాదిపై వివక్ష చూపించడమే’ అని ఖుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటి వరకూ మోదీపై ప్రశ్నలు, విమర్శలు గుప్పించినప్పటికీ పీఎంవో నుంచి గానీ.. మోదీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout