బంగారు కోడిపెట్టలతో స్టెప్పులు ఇరగదీసిన చిరు!
Send us your feedback to audioarticles@vaarta.com
అవును.. బంగారు కోడిపెట్టలతో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులు ఇరగదీశారు. ఇంతకీ బంగారు కోడిపెట్టలు ఎవరబ్బా అని ఆలోచిస్తున్నారా..? అదేనండి ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన అలనాటి నటీమణులతో చిరంజీవి డ్యాన్స్ చేశారు. అసలు ఆ బంగారు కోడిపెట్టలు ఎవరు..? చిరు రీల్‌లో డ్యాన్స్ చేశారా..? రియల్‌గా డ్యాన్స్ చేశారా..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యే కొత్త ఇంట్లోకి షిప్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొత్తింట్లో తన పాత స్నేహితులతో కలిసి అదిరిపోయేలా పార్టీ చేసుకున్నారు. అప్పట్లో ఉన్న స్టార్స్ అంతా ఈ పార్టీకి వచ్చారు. అందులో చిరు ఆల్ టైమ్ క్లోజ్ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. 10వ రీ యూనియన్ పార్టీ కావడంతో మెగాస్టార్ ఘనంగా ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖుష్బూ, రాధిక, సుమలత, నదియా, భాగ్యశ్రీ, రమ్యకృష్ణ, జయసుధ, లిజీ, పూర్ణిమ భాగ్యరాజ్.. వెంకటేష్, భానుచందర్, నరేష్, సురేష్ లాంటి చాలా మంది స్టార్స్ ఈ పార్టీకి వచ్చారు.
ఈ సందర్భంగా.. తన సూపర్ డూపర్ హిట్ సినిమా ‘ఘరానా మొగుడు’ సినిమాలోని ‘బంగారు కోడిపెట్ట..’ సాంగ్‌కు స్టెప్పులేసి ఇరదీశాడు. మొదట ఖుష్బూతో.. ఆ తర్వాత జయసుధతో చిరు డ్యాన్స్ చేశారు. కాగా.. చిరు ఎనర్జీకి తగ్గట్లుగానే ఖుష్భూ, జయప్రద ఇద్దరూ ఈ వయసులో కూడా చిందులేయడం విశేషమని చెప్పుకోవచ్చు.
ఈ స్టెప్పులను బట్టి చూస్తే.. నాటికి నేటికి చిరు డ్యాన్స్‌లో ఎలాంటి మార్పు రాలేదు. నాడు ఎలా అయితే స్టెప్పులేసి అభిమానులు, సినీ ప్రియులు మెప్పు పొందారో.. ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నాడు చిరు. కాగా ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక ఆలస్యమెందుకు మీరూ ఓ లుక్కేయండి. కాగా.. సీనియర్ హీరోల్లో డ్యాన్స్‌లో చిరును ఢీకొనే మొనగాడు లేడని అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments