నన్ను రేప్ చేస్తానని బెదిరిస్తున్నాడు: సీఎంకి కుష్బూ ఫిర్యాదు

  • IndiaGlitz, [Thursday,August 06 2020]

తనను ఓ ఆగంతకుడు రేప్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ సీనియర్ నటి, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ సోషల్ మీడియా వేదికగా అటు పోలీసులకు.. ఇటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. నువ్వు ముస్లింవి కాబట్టి రేప్ చేస్తానని బెదిరిస్తున్నాడని.. ఇది నిజంగా శ్రీరాముడు జన్మించిన నేలేనా అని ఆమె ప్రశ్నించారు. కానీ అతని వివరాలను మాత్రం బయటపెట్టారు. తనను బెదిరించిన వ్యక్తి నంబర్‌ను ట్రూ కాలర్‌లో సెర్చ్ చేస్తే సంజయ్ శర్మ అని వచ్చిందని తెలిపారు.

కోల్‌కతా నుంచి కాల్ చేస్తున్నాడని కుష్బూ వెల్లడించారు. తన వద్ద ఆ వ్యక్తి తాలుకు అన్ని వివరాలతో అటు కోల్‌కతా పోలీసులను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు చేసిన ట్వీట్‌ను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ట్యాగ్ చేస్తూ మరో ఫిర్యాదు చేశారు. ‘దీదీ కొంచెం ఆలోచించండి. నాకే ఇలాంటి బెదిరింపులు ఎదురువుతున్నాయంటే మిగిలిన మహిళల పరిస్థితి ఏంటో ఆలోచించండి’ అని కుష్బూ మమతను వేడుకున్నారు.

More News

సూప‌ర్‌హిట్ సీక్వెల్‌లో కీర్తిసురేశ్‌..?

అల‌నాటి సావిత్రి జీవిత‌గాథ‌ను ‘మ‌హాన‌టి’ పేరుతో రీమేక్ చేస్తే అందులో సావిత్రి రూప‌ను త‌ల‌పిస్తూ అద్భుతంగా న‌టించిన కీర్తి సురేశ్‌కు నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కింది.

జగన్‌కు ప్రేమాలయం కట్టుకోండంటూ విరుచుకుపడిన రఘురామరాజు

కేంద్రం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు వై కేటగిరి భద్రతను కేటాయించింది. ఈ సందర్భంగా ఆయన నేడు మీడియాతో మాట్లాడారు.

బ్రేకింగ్: రాష్ట్రాలకు కోవిడ్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ విడుదల

రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న కోవిడ్-19 ఫైనాన్షియల్ ప్యాకేజీలో భాగంగా సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్‌ కింద రూ.890.32 కోట్లను యూనియన్ గవర్నమెంట్ విడుదల చేసింది.

బ్రేకింగ్: ఎంపీ రఘురామరాజుకు వై కేటగిరీ భద్రత

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజుకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించనున్నట్టు కేంద్రం వెల్లడించింది.

దేశంలో 20 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. వరుసగా ఏడో రోజు కూడా..

దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మరి విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులు 20 లక్షలకు చేరువయ్యాయి.