ఖుష్బూకి షాక్.. ఆడియో టేప్ లీక్
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ నటి, నిర్మాత, కాంగ్రెస్ నేత ఖుష్బూ సుందర్‌కి ఈరోజు పెద్ద షాక్ తగిలింది. ఆమె జర్నలిస్టుల గురించి మాట్లాడిన ఆడియో టేప్ ఒకటి లీక్ కావడమే అందుకు కారణం. ఊహించని పరిణామానికి ఖుష్బూ షాకైంది. వెంటనే ట్విట్టర్ వేదికగా ఆమె జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. అసలు విషయం చూస్తే.. సినిమాలు, టీవీలకు సంబంధించిన షూటింగ్స్‌కు ప్రభు్త్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీవీ నిర్మాతల సంఘం వాట్సాప్ గ్రూప్‌లో ఖుష్బూ ఓ ఆడియో టేప్ విడుదల చేసింది. ‘ఇప్పటి వరకు జర్నలిస్టులకు కరోనా మాత్రమే వార్తైంది. ఇప్పుడు షూటింగ్స్ స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి మనపై ఫోకస్ పెడతారు. మన ఫొటోలు, వీడియోలకు అనుమతులు ఇవ్వకండి’ అని ఖుష్బూ చెప్పిన ఆడియో టేప్ లీకైంది.
దీనిపై ట్విట్టర్ వేదికగానే ఖుష్బూ స్పందించారు. ‘నేను 34 ఏళ్లుగా నటిగా కొనసాగుతున్నాను. అందుకు కారణం అందరితో మంచిగా ఉండటమే. ఇప్పటి వరకు నేను ఎక్కడా జర్నలిస్టుల గురించి చెడుగా మాట్లాడలేదు. ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే నన్ను క్షమించంది. ఏ నిర్మాత ఈ ఆడియో లీక్ చేశారో నాకు తెలుసు. వారి పేరు బయటకు చెప్పను. నా క్షమాగుణమే వారికి పెద్ద శిక్ష’ అని అన్నారు ఖుష్బూ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com