'కురుక్షేత్రం' సెప్టెంబర్ 13న విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన 150 సినిమా 'కురుక్షేత్రం'. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న విడుదల అవుతుంది. అరుణ్ వైద్యనాథన్ దర్శకుడు. ప్యాషన్ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీనివాస్ మీసాల తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్ లో..
ప్యాషన్ స్టూడియోస్ అధినేత ఉమేష్ రెడ్డి మాట్లాడుతూ - ''అర్జున్‌గారు కెరీర్‌లో ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఆయన 150 వ సినిమాను మా ప్యాషన్ సినిమా బ్యానర్‌లో చేయడం గర్వంగా ఉంది. తెలుగులో విడుదల చేయడానికి కాస్త సమయం పట్టింది. తెలుగులో విడుదల చేయడానికి సహకారం చేస్తున్న వాడపల్లి వెంకటేశ్వరరావుగారికి థాంక్స్. 13న సినిమా విడుదలవుతుంది'' అన్నారు.
వాడపల్లి వెంకటేశ్వరరావ బ్యానర్ అధినేత మీసాల శ్రీనివాస్ మాట్లాడుతూ - ''దండుపాళ్యం 3' సినిమాను విడుదల చేసిన తర్వాత తెలుగులో విడుదల చేస్తున్న రెండో సినిమా ఇది. అర్జున్‌గారికి, ఉమేష్‌గారికి థాంక్స్'' అన్నారు.
తమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ - ''ట్రైలర్ చాలా బావుంది. డెఫనెట్‌గా సినిమా సక్సెస్ అవుతుంది. వినాయక చవితికి ప్రేక్షకులు మాకు గిఫ్ట్ ఇస్తారని భావిస్తున్నాను'' అన్నారు.
నిర్మాత సాయిక్రిష్ణ మాట్లాడుతూ - ''మాటలు కంటే రేపు విడుదల కాబోయే మా సినిమానే మాట్లాడుతుంది'' అన్నారు.
దర్శకుడు అరుణ్ వైద్యనాథన్ మాట్లాడుతూ - ''ఉమేష్, సుధన్, జయరామ్ నా సినిమా మేకింగ్ సమయంలో ఎంతో సహకారం అందించారు. తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం తెలుగులో సాయిక్రిష్ణ, మీసాల శ్రీనివాస్‌గారు విడుదల చేస్తున్నారు. వారికి నా కృతజ్ఞతలు. అర్జున్‌గారు ఎంతో సహకారం అందించారు. సెట్స్‌లో అద్భుతంగా సపోర్ట్ చేశారు. డైరెక్టర్స్ యాక్టర్ ఆయన. 150 సినిమాల నటుడైనా.. ఎక్కడా గర్వం లేకుండా డౌన్ టు ఎర్త్ పర్సన్. పాజిటివ్ పర్సన్. ప్రసన్న, వరలక్ష్మి, చందన అందరూ వారి వారి పాత్రల్లో అద్భుతంగా నటించారు. టెక్నీషియన్స్ కూడా చక్కటి సహకారాన్ని అందించారు. కొత్తదనాన్ని ఎంకరేజ్ చేసే తెలుగు ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నాను'' అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ - ''నాకు అర్జున్ అంటే ఎంతో అభిమానం. మంచి మనిషి. ఆయన నటించిన 150వ సినిమా. మంచి థ్రిల్లర్. మా అందరికీ ఎంతో ఇన్‌స్పిరేషన్. అరుణ్, ఉమేష్, మీసాల శ్రీనివాస్, సాయిక్రిష్ణలకు అభినందనలు. ఇలాంటి ప్యాషన్ ఉన్న నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
యాక్షన్ కింగ్ అర్జున్ మాట్లాడుతూ - ''35 సంవత్సరాల జర్నీ. ఈ ప్రయాణంలో ఎంతో మంది దర్శక నిర్మాతలతో ప్రయాణం చేశాను. నటన గురించి తెలుసుకున్నాను. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. తర్వాత రైటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, దర్శకుడిగా కొనసాగుతున్నాను. హార్డ్ వర్క్‌ను స్థిరంగా చేస్తూ వస్తే దాని ఫలితం తప్పకుండా ఉంటుంది. కురుక్షేత్రం సినిమా నా 150వ సినిమా. నా టెప్ టెన్ మూవీస్‌లో ఇదొకటి. ఇందులో విభిన్నమైన పోలీస్ ఆఫీసర్‌గా నటించాను. రియాలిటీకి దగ్గరగా ఉండే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనపడతాను. యాక్షన్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ. మంచి సినిమాలను ఎంకరేజ్ చేసే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉంది'' అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com