హైద‌రాబాద్‌కొచ్చిన క‌ర్నూలు...

  • IndiaGlitz, [Monday,July 22 2019]

త‌మ హీరోల కోసం ఆయా ఊర్ల నుంచి అభిమానులు హైద‌రాబాద్‌కి త‌ర‌లిరావ‌డం మ‌న‌కు ఇంత‌కు ముందే తెలుసు. అయితే ఏకంగా న‌గ‌రాలే త‌ర‌లిరావ‌డం తెలుసా? ఎందుకు తెలియ‌దు.. ఆయా చోట్ల‌కు వెళ్లి షూటింగ్ చేయ‌లేని ప‌రిస్థితులు ఉన్న‌ప్పుడు హైద‌రాబాద్‌లోనే ఆ న‌గ‌రాల‌ను ఏర్పాటు చేస్తుంటారు. తాజాగా అలాంటి ఏర్పాటే జ‌రుగుతోంది. అదీ మ‌హేష్ కోసం. ఈ సారి హైద‌రాబాద్‌కు త‌ర‌లి వ‌చ్చిన ఊరి పేరు క‌ర్నూలు. ఈ నెల 26 నుంచి హైద‌రాబాద్‌లో మ‌హేష్ చిత్రం 'స‌రిలేరు నీకెవ్వ‌రు' చిత్రీక‌రించ‌నున్నారు.

ఈ సినిమా కోసం క‌ర్నూలు ఫేమ‌స్ కొండా రెడ్డి బురుజును రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ చేస్తున్నారు. మ‌హేష్ ఒక్క‌డులోనూ కొండారెడ్డి బురుజుకు ఉన్న ప్ర‌త్యేక‌త మ‌న‌కు తెలియ‌నిది కాదు. ఈ సినిమాలోనూ కొండారెడ్డి బురుజు సెట్లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. మ‌హేష్‌, ర‌ష్మిక‌కు మ‌ధ్య మంచి రొమాంటిక్ ఎపిసోడ్ పూర్త‌యిన త‌ర్వాత ఈ సెట్‌కు త‌ర‌లి వెళ్ల‌నుంది యూనిట్‌. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి ద‌ర్శ‌కుడు. రాజేంద్ర‌ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ధారి. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు.

More News

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు చేతుల మీదుగా `గుణ 369`లోని మూడో పాట విడుద‌ల‌!

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు చేతుల మీదుగా `గుణ 369`లోని మూడో పాట సోమ‌వారం హైద‌రాబాద్‌లో విడుద‌లైంది.

తాన్యా... హోప్ ఫ‌లించిన‌ట్టేగా

కాస్త అందం, అభిన‌యం ఉన్న‌ హీరోయిన్లు ఓ మోస్త‌రు హీరోల ప‌క్కన న‌టించ‌డం ప‌రిపాటి. మ‌రో అడుగు ముందుకేసి ర‌వితేజ‌లాంటి వారి స‌ర‌స‌న న‌టించ‌డ‌మంటే...

విక్టరీ వెంకటేష్‌ క్లాప్‌తో ప్రారంభమైన మా ఆయి ప్రొడక్షన్స్‌ యాక్షన్ థ్రిల్లర్ '22'

శివకుమార్‌ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్  '22'.

షాకింగ్ వీడియోను పోస్ట్ చేసిన రజనీకాంత్ సతీమణి!

సూపర్‌స్టార్ రజనీకాంత్ సతీమణి లత తన ట్విట్టర్ వేదికగా ఓ షాకింగ్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన జనాలంతా ఒకింత తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.

నువ్.. మొనగాడు, మగాడివైతే రాజీనామా చెయ్..!

ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య రోజురోజుకు సోషల్ మీడియా వేదికగా రచ్చ ముదురుతోంది.