హైదరాబాద్‌కొచ్చిన కర్నూలు...
Send us your feedback to audioarticles@vaarta.com
తమ హీరోల కోసం ఆయా ఊర్ల నుంచి అభిమానులు హైదరాబాద్‌కి తరలిరావడం మనకు ఇంతకు ముందే తెలుసు. అయితే ఏకంగా నగరాలే తరలిరావడం తెలుసా? ఎందుకు తెలియదు.. ఆయా చోట్లకు వెళ్లి షూటింగ్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు హైదరాబాద్‌లోనే ఆ నగరాలను ఏర్పాటు చేస్తుంటారు. తాజాగా అలాంటి ఏర్పాటే జరుగుతోంది. అదీ మహేష్ కోసం. ఈ సారి హైదరాబాద్‌కు తరలి వచ్చిన ఊరి పేరు కర్నూలు. ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌లో మహేష్ చిత్రం `సరిలేరు నీకెవ్వరు` చిత్రీకరించనున్నారు.
ఈ సినిమా కోసం కర్నూలు ఫేమస్ కొండా రెడ్డి బురుజును రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ చేస్తున్నారు. మహేష్ ఒక్కడులోనూ కొండారెడ్డి బురుజుకు ఉన్న ప్రత్యేకత మనకు తెలియనిది కాదు. ఈ సినిమాలోనూ కొండారెడ్డి బురుజు సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మహేష్, రష్మికకు మధ్య మంచి రొమాంటిక్ ఎపిసోడ్ పూర్తయిన తర్వాత ఈ సెట్‌కు తరలి వెళ్లనుంది యూనిట్. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. రాజేంద్రప్రసాద్ కీలక పాత్రధారి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments