అభయ్‌కి ఇంత ప్రేమను అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు..హీరో కునాల్ కెమ్ము
Send us your feedback to audioarticles@vaarta.com
ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్ మూవీస్ మరియు వెబ్ సిరీస్‌లతో వీక్షకుల మనసులు దోచుకొంటుంది ZEE5. ప్రతి నెల ZEE5 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్ రిలీజ్‌లతో తెలుగు ఓటిటి ల్యాండ్‌స్కేప్‌లో బెంచ్‌మార్క్ సెట్ చేస్తోంది. తాజాగా అభయ్ 1 & 2 వెబ్ సిరీస్ లు సక్సెస్ అయినందున. అభయ్ 3 ని తెలుగు వీక్షకుల ముందుకు తీసుకు వస్తోంది ZEE5.అభయ్ 3 లో కునాల్ కెమ్ము పోలీస్ ఆఫీసర్ గా అభయ్ ప్రతాప్ సింగ్ పాత్రలో నటించారు. తన వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అనేక కొత్త, తెలియని బెదిరింపులను ఎదుర్కొంటాడు.అక్కడ జరుగుతున్న వాటన్నిటినీ ఎలా ఛేదించాడనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కథ. అయితే అభయ్ 3 ప్రమోషన్స్ కోసం కునాల్ కెమ్ము, కెన్ ఘోష్ లు హైదరాబాద్ ను సందర్శించడంతో ZEE5 యూనిట్ పాత్రికేయుల సమావేశంలో ఏర్పాటు చేసి అభయ్ 3 ట్రైలర్ ను విడుదల చేసింది.
అభయ్ 3 ట్రైలర్ చూసినప్పుడు ప్రేక్షకులు ఆశ్చర్యానికి లోనవుతారు, ఈ సీజన్ చీకటిలో క్రూరంగా జరిగిన ఇన్సిడెంట్స్‌ను హీరో చాలా ధైర్యంగా చేధించడం వంటి సీన్స్ చూస్తుంటే, రెండు విజయవంతమైన సీజన్‌లను తీసి విమర్శకుల ప్రశంసలు పొందిన ZEE5 ఫ్రాంచైజీ ఇప్పుడు థ్రిల్లర్ జానర్‌లో తనదైన ప్రత్యేకతను సృష్టించుకుంటుంది. అభయ్ 3 ప్రీమియర్ తేదీని ఏప్రిల్ 8గా సెట్ చేయడంతో, అభిమానులు అభయ్ 3 కోసం ఎదురు చూస్తున్నారు.ఇది ZEE5 లో హిందీ, తమిళం మరియు తెలుగులో మాత్రమే ప్రసారం చేయబడుతుంది.
కునాల్ కెమ్ము మాట్లాడుతూ... ‘‘అభయ్‌కి ఇంత ప్రేమను అందించినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు దేనినైనా ఇష్టపడితే ఎంతగా అభిమానం చూపిస్తారో చెప్పనక్కర్లేదు. ఇది నేను నిజంగా నమ్మిన విషయం అని నేను నిజాయితీగా భావిస్తున్నాను. ఇందులో నాది పోలీస్ ఆఫీసర్ గా ఆసక్తికరమైన పాత్ర, . దర్శకుడు కెన్ ఘోష్ కూడా చాలా కష్టపడ్డాడు. అతను నిజంగా అంత చీకటిలో చిత్రం చేయడం సాహసమే. భారతదేశంలోని ప్రముఖ ఫ్రాంచైజీలలో ఒకటైన ZEE55 యొక్క అభయ్ సీజన్ 3 గురించి మాట్లాడుతున్నందుకు నేను హ్యాపీగా భావిస్తున్నాను. అలాంటి దానిలో భాగమైనందుకు చాలా గర్వంగా కూడా ఉంది’’ అన్నారు.
దర్శకుడు కెన్ ఘోస్ మాట్లాడుతూ.. ఆడియన్స్ ఇప్పుడు కొత్త ధనాన్ని కోరుకుంటున్నారు.ఇప్పటి వరకు కునాల్ కాప్‌గా పని చేయకపోయినా తను ఇందులో అద్భుతంగా నటించాడు. ఇందులో చూపిచించిన ప్రతి ఎపిసోడ్ కూడా రియల్ ఇన్సిడెంట్స్. అభయ్ 3ని ప్రత్యేకంగా ZEE5 లో ఏప్రిల్ 8 నుండి హిందీ, తమిళం మరియు తెలుగులో చూడండి అన్నారు.
అభయ్ 3 ని కెన్ ఘోష్ దర్శకత్వం వహించగా ZEE5 స్టూడియోస్ నిర్మించారు, అభయ్ 3 లో కునాల్ కెమ్ము, ఆశా నేగి నిధి సింగ్ నటించారు మరియు విజయ్‌రాజ్, రాహుల్ దేవ్, విద్యా మాల్వాడే, తనూజ్ విర్వాణి , దివ్య అగర్వాల్ తదితరులు ఉన్నారు.
నటీనటులు : కునాల్ కెమ్ము, ఆశా నేగి , నిధి సింగ్ విజయ్ రాజ్, రాహుల్ దేవ్, విద్యా మాల్వాడే, తనూజ్ విర్వాణి దివ్య అగర్వాల్ తదితరులు. సాంకేతిక నిపుణులు : నిర్మాత : ZEE5 దర్శకుడు : కెన్ ఘోష్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments