అల్లు అర్జున్ చేతుల మీదుగా 'కుమారి 21 ఎఫ్' ఆడియో రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
విభిన్న కథా చిత్రాల దర్శకుడు సుకుమార్ నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నం కుమారి 21 ఎఫ్. ఈ చిత్రంలో రాజ్ తరుణ్, హీబా పటేల్ జంటగా నటించారు. సుకుమార్ శిష్యుడు సూర్యప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించిన కుమారి 21 ఎఫ్ ఆడియో రిలీజ్ కార్యక్రమం సినీప్రముఖులు, అభిమానుల సమక్షంలో హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్యఅతిధిగా హాజరై కుమారి 21 ఎఫ్ ఆడియోను రిలీజ్ చేసారు.
కుమారి 21 ఎఫ్ మూవీకి సంబంధించి నిర్వహించిన కాంటెస్ట్ లో గెలిచిన 21 మంది విజేతలకు ఎస్ మార్ట్ సిఇవో నీలిమ గిఫ్ట్స్ అందచేసారు. అలాగే ఈ 21 మంది విజేతలకు సింగపూర్ ట్రిప్ వెళ్లడానికి వన్‌వే టికెట్స్ బంపర్ ఆఫర్ గా అందచేయడం విశేషం.
ఈ 21 మంది అమ్మాయిలో ప్రత్యూష, రసజ్న అధితి, వాణి ఈ ముగ్గురు లక్కీ విన్నర్స్ ని లక్కీడ్రా ద్వారా సుకుమార్, దేవిశ్రీప్రసాద్, రత్నవేలు తీసి గిఫ్ట్స్ అందించారు ఈ ముగ్గురిలో ఫైనల్ విన్నర్ గా వాణిని అల్లు అర్జున్ లక్కీ డ్రా ద్వారా తీసి బంపర్ గిఫ్ట్ అందచేసారు.
సుకుమార్ మాట్లాడుతూ...బ్యాంకాక్ లో చిత్రీకరించిన సాంగ్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం తో పాటు సాహిత్యాన్నికూడా అందించాడు. ఒకప్పుడు కవిత్వం రాసేవాడిగా చెబుతున్నాను..దేవి అద్భుతంగా రాస్తున్నాడు. ఈ సాంగ్ కి సంగీతం, సాహిత్యమే కాదు కొరియోగ్రాఫర్ కూడా దేవినే. కొరియోగ్రాఫర్ గా ఇప్పుడే పరిచయం అవుతున్న దేవిశ్రీప్రసాద్ ను అందరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.
అలాగే కెమెరామెన్ రత్నవేలు గురించి చెప్పాలంటే...ఎంత గొప్ప టెక్నీషియనో అందరికీ తెలుసు. ఇండియాలోనే బెస్ట్ 3 రత్నవేలు ఒకడు. అసిస్టెంట్ డైరెక్ట్రర్ గా వర్క్ చేయలేదు. కానీ డైరెక్టర్ అయ్యాను. అతని సమక్షంలోనే డైరెక్టర్ అయ్యాను. రత్నవేలు నాకు ఒ బ్రదర్ లాంటి వాడు. కథ నచ్చి ఈ సినిమాకి రత్నవేలు వర్క్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. డైరెక్టర్ ప్రతాప్ లేనిదే ఈ సినిమా లేదు. ఈ సినిమా ప్రతాప్ కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు.
రాజీవ్ కనకాల మాట్లాడుతూ...సుకుమార్ నిర్మాతగా కుమారి 21 ఎఫ్ అనే అద్భుతమైన సినిమాని అందిస్తున్నారు. దేవిశ్రీ గురించి ఎంత చెప్పినా తక్కవే... ఏ పాట అయినా సరే అద్భతమైన సంగీతం అందిస్తారు. ఇటీవల శ్రీమంతుడులో మంచి పాటలు అందించారు. కుమారి 21 ఎఫ్ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ...ఈ సినిమాకి వర్క్ చేయడానికి మెయిన్ రీజన్.. సుక్కు మీద ఉన్న లవ్ ఫీల్ అవ్వడం వల్లనే ఈ మూవీకి మ్యూజిక్ చేసాను. డైరెక్టర్ ప్రతాప్ తో గతంలో కరెంట్ సినిమాకి వర్క్ చేసాను. మళ్లీ ఈ సినిమాకి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. సుకుమార్ నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నం సక్సెస్ అవ్వాలి. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ హేబా పటేల్ కి ఈ మూవీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత బన్ని వాసు మాట్లాడుతూ...సుక్కు మంచి డైరెక్టర్..అంతకు మించి మంచి మనిషి. ఈ మంచి మనిషి నిర్మాతగా చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలి అన్నారు.
మాటల రచయిత వెంకీ మాట్లాడుతూ...ఒక మనిషి వాడంతటవాడు ఎదగడు. వాడు చుట్టూ ఉన్నవాళ్లు హెల్ప్ చేస్తుంటారు. ఇలా నాకు సుకుమార్ హెల్స్ చేసారు. నాకు హెల్ప్ చేసిన వారందరికీ థ్యాంక్స్. దేవిశ్రీ, రత్నవేలు...ఇలా టాప్ టెక్నిషియన్స్ వర్క్ చేసిన సినిమా నా మొదటి సినిమా కావడం సంతోషంగా ఉంది అన్నారు.
డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ...21 ఎఫ్ అంటే దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు, సుకుమార్ ...ఈ ముగ్గురు తీసిన సినిమా ఫిల్మ్ అని అఅర్ధం . టైటిల్ తెలివిగా పెట్టారు. అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుంది ఆల్ ది బెస్ట్ టు కుమారి 21 ఎఫ్ టీమ్ అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..2003లో ఆర్య కథని సెకండ్ టైమ్ అల్లు అరవింద్ గారికి చెప్పమని సుకుమార్ తో చెబితే... అరవింద్ గారు ఓకె చేస్తారో లేదో..నేను ఊరు వెళ్లిపోతానన్నాడు. కట్ చేస్తే ఇప్పుడు డైరెక్టర్ గా & నిర్మాతగా సినిమాలు తీస్తున్నాడు. ఇండస్ట్రీలో సహనం ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. బన్ని, సుకుమార్, దేవిశ్రీప్రసాద్, రత్నవేలు... ఇదంతా ఆర్య టీమ్. ఇప్పడు ఇలా కలవడం సంతోషంగా ఉంది అన్నారు.
కెమెరామెన్ రత్నవేలు మాట్లాడుతూ...ఆర్య సినిమా తర్వాత అంటే 12 ఏళ్ల తర్వాత మళ్లీ బన్నిని ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతాప్ వెరీ గుడ్ డైరెక్టర్. 20 సంవత్సరాల నా ఎక్స్ పీరియన్స్ లో సుకుమార్ లాంటి మంచి వ్యక్తిని చూడలేదు అన్నారు.
డైరెక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ...ఆర్య సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాను. కరెంట్ సినిమాకి దేవిశ్రీతో వర్క్ చేసాను. మళ్లీ ఈ సినిమాకి దేవిశ్రీతో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. మేమంతా ఇంత కష్టపడి సినిమా చేసాం అంటే కారణం సుకుమార్ గారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అన్నారు.
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ..జగడం సినిమాను నేను 9వ తరగతిలో ఉన్నప్పడు చూసాను. సుకుమార్ గారి సినిమాలంటే చాలా ఇష్టం. అలాంటిది ఆయన నిర్మించే సినిమాలో నేను నటించడం చాలా ఆనందంగా ఉంది. దేవిగారి పాటలకు నేను డాన్స్ చేస్తానని అనుకోలేదు. సుకుమార్ గారి డైలాగ్స్ నేను చెప్పడం ఇంకా హ్యాపీ. రత్నవేలు గారితో వర్క్ చేయడం నా అద్రుష్టం అన్నారు.
హీరోయిన్ హేబా పటేల్ మాట్లాడుతూ...కెమెరామెన్ రత్నవేలు గారు ఇండియాలో నంబర్ 1 టెక్నీషయన్. మై ఫ్రెండ్.. టీచర్ అన్నీ డైరెక్టర్ ప్రతాప్ గారే. సుకుమార్ గారు నిర్మించిన సినిమాలో నటించడం హ్యాపీగా ఫీలవుతున్నాను అన్నారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ...సుకుమార్ నిర్మాతగా చేస్తున్న తొలి చిత్రానికి దేవిశ్రీ ఆడియో ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. అలాగే రత్నవేలు సర్ కి థ్యాంక్స్. రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మామ చూసాను. ఈ సినిమాతో రాజ్ తరుణ్ హ్యాట్రిక్ సాధించాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ ప్రతాప్ కి ఆల్ ద బెస్ట్. నేను, సుకుమార్ కలసి మళ్లీ ఆర్యను మించేలా ఓ సినిమాను చేస్తాం అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout