'కుమారి 21 ఎఫ్' మూవీ రివ్యూ

  • IndiaGlitz, [Friday,November 20 2015]

ఆర్య‌తో ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌య‌మైన సుకుమార్ ద‌ర్శ‌కుడిగా త‌నకంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్నాడు. కుమారి 21 ఎఫ్ తో సుకుమార్ తొలిసారి నిర్మాత‌గా మారాడు. కేవ‌లం సినిమాను ప్రొడ్యూస్ చేయ‌డ‌మే కాకుండా ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే కూడా అందించాడు, ఆర్య‌, 100 %ల‌వ్ వంటి డిఫ‌రెంట్ ల‌వ్‌స్టోరీస్‌ను డైరెక్ట్ చేసిన సుకుమార్ ఈ సినిమాకు మాత్రం ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్‌కు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాడు. సుకుమార్‌తో ఉన్న స్నేహం కార‌ణంగా మిత్రుడి కోసం దేవిశ్రీప్ర‌సాద్‌, ర‌త్న‌వేలు కూడా త‌మ వంతుగా స‌హాయం చేశారు. మ‌రి ఈ స్నేహితుల ప్ర‌య‌త్నం ఏ మేర స‌క్సెస్ అయిందో తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం.

క‌థ‌

హైద‌రాబాద్‌లోని ఓ కాలనీలోని సిద్ధు(రాజ్ త‌రుణ్‌) త‌న త‌ల్లి(హేమ‌)తో నివ‌సిస్తుంటాడు. అత‌నికి శంక‌ర్(నోయెల్‌) స‌హా మ‌రో ఇద్ద‌రితో మంచి స్నేహం కూడా ఉంటుంది. శంక‌ర్ అండ్ గ్యాంగ్ ఏటీఎం దొంగ‌త‌నాలు చేస్తుంటారు. వారికి సిద్ధు త‌న వ‌ల్ల వీలైనంత స‌హాయం చేస్తుంటాడు. ఓ రోజు కాల‌నీలో కుమారి(హేబా ప‌టేల్‌)ను అనుకోకుండా క‌లిసిన సిద్ధుకి ఆమెతో ప‌రిచ‌యం పెరుగుతుంది. కుమారి చాలా బోల్డ్‌గా ఉంటుంది. త‌న మ‌న‌సులో అనుకున్న భావాల‌ను ధైర్యంగా చెప్పేస్తుంటుంది. అలా వీరి ప‌రిచ‌యం ప్రేమ వ‌ర‌కు వెళుతుంది. కానీ సిద్ధు స్నేహితులైన శంక‌ర్ అండ్ గ్యాంగ్ కుమారి క్యారెక్ట‌ర్ మంచిది కాద‌ని అన‌డంతో కుమారి క్యారెక్ట‌ర్‌ను అనుమానించిన సిద్దుకి కొన్ని విష‌యాలు తెలుస్తాయి. ఆ విష‌యాలేంటి? అందులో నిజాలేంటి? అస‌లు శంక‌ర్ అండ్ గ్యాంగ్ కేవ‌లం ఏటీఎం దొంగ‌త‌నాలే చేస్తుంటారా? ఈ విషయాల‌న్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే ...

ప్ల‌స్ పాయింట్స్‌

ర‌చ‌యిత‌గా సుకుమార్ చెప్పాల‌నుకున్న పాయింట్ బావుంది. అందుకు త‌గిన విధంగా కథ‌ను న‌డిపించిన తీరు కూడా బావుంది. ప్రేమ‌లో నిజాయితీ ఉండాల‌ని ఆర్య సినిమాతో చెప్పిన సుకుమార్ ఈ సినిమాలో ప్రేమించ‌డానికి మెచ్యురిటీ ఉండాల‌నే విష‌యాన్ని చెప్పాల‌నుకున్నాడు. ఆ కాన్సెప్ట్‌ను ఈ జ‌న‌రేష‌న్ అమ్మాయి, అబ్బాయితో ముడిపెట్టి క‌థ‌ను రాసుకున్నాడు.రాజ్ త‌రుణ్‌, హేబా ప‌టేల్ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. హేబా గ్లామ‌ర్‌గా క‌నిపించింది. నోయ‌ల్, హేమ స‌హా మిగ‌తా న‌టీన‌టులు వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక దేవిశ్రీ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. సినిమాలో దేవి కంపోజ్ చేసిన స్లోలీ స్లోలీ...సాంగ్ స‌హా ఫ‌స్టాఫ్‌లో వ‌చ్చే సాంగ్స్‌, బ్రేక‌ప్ సాంగ్‌, ల‌వ్ చేయ్యాలా వ‌ద్దా అనే సాంగ్ అన్నీ బావున్నాయి. ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ గురించి కొత్తగా చెప్పుకోడానికి ఏమీ లేదు. ఎక్స‌లెంట్ సినిమాటోగ్ర‌పీ. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బావుంది.

మైన‌స్ పాయింట్స్‌

ర‌చ‌యిత‌గా క‌థ‌ను రాసుకున్న సుకుమార్ ఎగ్జిక్యూష‌న్ స‌రిగాలేదు. చెప్పాల‌నుకున్న విష‌యాన్ని చెప్ప‌డానికి చేసే ప్ర‌య‌త్నంలో బూతు కంటెంట్‌ను ఎక్కువ‌గా వాడేశాడు. 500 రూపాయ‌లకు వ‌స్తావా? అని హీరో్యిన్, హీరోను అడ‌గ‌టం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అలాగే హీరోయిన్ క్యారెక్ట‌ర్‌ను సినిమా ప్రారంభంలో మ‌రి త‌క్కువ‌గా చేసి చూపించారు. చెప్పాల‌నుకున్న విష‌యాన్ని బోల్డ్‌గా చెప్ప‌వ‌చ్చు కానీ పొంత‌న లేకుండా డ‌బుల్ మీనింగ్‌తో చెప్ప‌డ‌మేంటో అర్థం కావ‌డం లేదు. హీరోయిన్‌కు ముంబైలో ఏదో బ్యాడ్ ప్లాష్ బ్యాక్ ఉంటుంద‌ని ముందు చూపించి దాన్ని సింపుల్ తేల్చిపారేశారు. చెడు విష‌యాన్ని కూడా అందంగా చెప్ప‌వ‌చ్చు కానీ సినిమాను ఏదో చెప్పాల‌నుకుని ఏదో చెప్పేసినట్టుంది. హీరో తల్లి, తండ్రి ఏదో అనుమానంతో ఇర‌వై సంవ‌త్స‌రాలు దూరంగా ఉండ‌ట‌మ‌నేది లాజిక్ లేకుండా చూపెట్టారు.

విశ్లేష‌ణ‌

ఇప్ప‌టి ట్రెండ్‌కు త‌గిన ల‌వ్‌స్టోరిని సుకుమార్ త‌న స్ట‌యిల్ రాసుకున్నాడు. దాన్ని సూర్య‌ప్ర‌తాప్ చ‌క్క‌గానే డైరెక్ట్ చేశాడు. దానికి దేవిశ్రీ, ర‌త్న‌వేలు టెక్నిక‌ల్ వాల్యూస్ తోడు కావ‌డంతో సినిమా రిచ్‌గా క‌న‌ప‌డుతుంది. అయితే సినిమా స్లోగా సాగుతున్న‌ట్లు ఉంటుంది. హీరో త‌న ప్రేమ‌ను హీరోయిన్‌కు చెప్పే సీన్, హీరోయిన్ త‌న ప్రేమ‌లోని నిజాయితీ గురించి హీరోకు చెప్పే స‌న్నివేశం ఆక‌ట్టుకుంటుంది. అయితే సుకుమార్ సినిమాలో హీరోయిన్‌ను స్టార్టింగ్‌లో ఒక‌లా చూపించే ప్ర‌య‌త్న‌మే ప్రేక్ష‌కులకు మింగుడు ప‌డ‌దు. మొత్తం మీద యూత్ కంటెంట్‌తో పాటు ప్రేమ‌లో న‌మ్మ‌కం ఉండాల‌నే విష‌యాన్ని సుకుమార్ ఈ సినిమాలో చూపించే ప్ర‌య‌త్నం చేశాడు.

బాట‌మ్ లైన్‌: ప్రేమంటే న‌మ్మ‌క‌మ‌ని చెప్పే కుమారి

రేటింగ్: 2.5/5

English Version Review

More News

కమల్ హాసన్ పెర్ఫామెన్స్ థ్రిల్ కలిగించింది - మంత్రి కేటీఆర్

విశ్వనటుడు,లోకనాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా రాజేష్.ఎం.సెల్వ దర్శకత్వంలో రాజ్ కమల్ ఫిల్మ్స్ఇంటర్నేషనల్ -శ్రీ గోకుళం మూవీస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా 'చీకటిరాజ్యం'.

పోలీస్ పాత్రలో వెంకీ..

విక్టరీ వెంకటేష్ గోపాల గోపాల తర్వాత ఇన్నాళ్లకు న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు.ఈ చిత్రానికి యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించనున్నారు.

'చీకటి రాజ్యం' మూవీ రివ్యూ

కమల్ హాసన్ సినిమా అంటే తమిళ ప్రేక్షకుల సంగతేమో కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తారు. అదీ కాకుండా సాగర సంఘమం వంటి సహా పలు తెలుగు స్ట్రయిట్ సినిమాల్లో కూడా కమల్ నటించి సక్సెస్ సాధించాడు.

మనోజ్ 'శౌర్య' ఫస్ట్ లుక్ విడుదల

బేబి త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్ టైన్ మెంట్స్ఇండియా ప్రై.లి.బ్యానర్పై దశరథ్ దర్శకత్వంలో శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్న చిత్రం శౌర్య.

మనోజ్ న్యూమూవీ ఫస్ట్ లుక్ రిలీజ్...

మంచు మనోజ్ నటిస్తున్న తాజా చిత్రానికి శౌర్య అనే టైటిల్ ఫిక్స్ చేసారు.దశరథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో మనోజ్ సరసన రెజీనా నటిస్తుంది.