కుమారి 21 ఎఫ్ టీజర్ లాంచ్ చేస్తున్న ఎన్టీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
విభిన్నకథా చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్న డైరెక్టర్ సుకుమార్. తొలిసారిగా నిర్మాతగా మారి కుమారి 21 ఎఫ్ పేరుతో సుకుమార్ ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు కూడా అందిస్తుండడం విశేషం.
ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మామ చిత్రాలతో యూత్‌లో మంచి గుర్తింపు పొందిన రాజ్‌తరుణ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండగా... హేభ పటేల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, ఆర్య, రోబో, వన్, లింగా వంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన రత్నవేలు ఫోటోగ్రఫీని అందిస్తుండటం విశేషం.
సూర్య ప్రతాప్ పల్నాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ తొలిసారి నిర్మిస్తున్న కుమారి 21 ఎఫ్ చిత్రం టీజర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో లండన్ లో లాంఛ్ చేయనున్నారట. ఎన్టీఆర్ ఈ టీజర్ ను లాంఛ్ చేస్తే ఈ మూవీపై మరిన్నిఅంచనాలు పెరగడం ఖాయం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com