కుమారి 21 ఎఫ్ టీజ‌ర్ లాంచ్ చేస్తున్న ఎన్టీఆర్

  • IndiaGlitz, [Friday,September 18 2015]

విభిన్న‌క‌థా చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్ప‌రుచుకున్న డైరెక్ట‌ర్ సుకుమార్. తొలిసారిగా నిర్మాతగా మారి కుమారి 21 ఎఫ్ పేరుతో సుకుమార్ ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు కూడా అందిస్తుండ‌డం విశేషం.

ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మామ చిత్రాలతో యూత్‌లో మంచి గుర్తింపు పొందిన రాజ్‌తరుణ్ ఈ చిత్రంలో హీరోగా న‌టిస్తుండ‌గా... హేభ పటేల్ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ చిత్రానికి యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, ఆర్య, రోబో, వన్, లింగా వంటి ప్రతిష్టాత్మక చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన రత్నవేలు ఫోటోగ్రఫీని అందిస్తుండటం విశేషం.

సూర్య ప్రతాప్ పల్నాటి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సుకుమార్ తొలిసారి నిర్మిస్తున్న కుమారి 21 ఎఫ్ చిత్రం టీజ‌ర్ ను యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్వ‌ర‌లో లండ‌న్ లో లాంఛ్ చేయ‌నున్నార‌ట‌. ఎన్టీఆర్ ఈ టీజ‌ర్ ను లాంఛ్ చేస్తే ఈ మూవీపై మ‌రిన్నిఅంచ‌నాలు పెర‌గడం ఖాయం.

More News

అందుకు నయనతార ఒప్పుకోలేదా?

ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలు, ఫెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ సినిమాలకే పరిమితమైన మలయాళ సుందరి నయనతార లెటెస్ట్ మూవీ ‘మయూరి’(తమిళంలో ‘మాయ’).

'కంచె' పాటల పల్లకి ఆవిష్కరణ మహోత్సవం

మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్. ప్రగ్యాజైశ్వాల్ జంటగా నటించిన సినిమా ‘కంచె’.ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి,జె.సాయిబాబు నిర్మించారు.

'నాన్నకు ప్రేమతో..'ఫస్ట్ లుక్ విడుదల...

యంగ్టైగర్ ఎన్టీఆర్, ఆర్య సుకుమార్ కాంబినేషన్లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా,

'కొరియర్ బాయ్ కళ్యాణ్' మూవీ రివ్యూ

బ్యానర్ - ఎ గురు ఫిలింస్ ప్రొడక్షన్, మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి.

శర్వానంద్ కొత్త సినిమా టైటిల్ ఏమిటి...?

రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇది రానిరోజు...ఈ రెండు వరుస విజయాలతో దూసుకెళుతున్న యంగ్ హీరో శర్వానంద్.