'కుమారి 21ఎఫ్' రిలీజ్ వాయిదా

  • IndiaGlitz, [Wednesday,October 14 2015]

విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు సుకుమార్ నిర్మాతగా చేస్తున్న తొలి ప్ర‌య‌త్నం కుమారి 21 ఎఫ్‌. ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్‌, హీబా ప‌టేల్ జంట‌గా న‌టించారు. సుకుమార్ శిష్యుడు సూర్య‌ప్ర‌తాప్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రాజ్ త‌రుణ్ తో సుకుమార్ నిర్మించిన కుమారి 21 ఎఫ్ కి మ‌హేష్, ఎన్టీఆర్,.. విషెస్ తెలియ‌చేయ‌డంతో ఈ సినిమా పై మ‌రింత క్రేజ్ పెరిగింది. అయితే కుమారి 21 ఎఫ్ సినిమాని ఈ నెల 30న రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ కొన్ని కార‌ణాల వ‌ల‌న రిలీజ్ వాయిదా ప‌డింది. యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందించిన‌ కుమారి 21 ఎఫ్ ఆడియోను ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ చేసి...సినిమాని న‌వంబ‌ర్ 13న రిలీజ్ చేయ‌నున్నారు.