'కుమారి 21 ఎఫ్' ప్లాటినమ్ డిస్క్..
Send us your feedback to audioarticles@vaarta.com
హేబా పటేల్, రాజ్ తరుణ్ జంటగా సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న చిత్రం 'కుమారి 21 ఎఫ్'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో పెద్ద సక్సెస్ అయింది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ చైతన్య కాలేజ్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్రబృందానికి రత్నవేలు, దేవీశ్రీప్రసాద్ ప్లాటినమ్ డిస్క్ లను అందించారు.
ఈ సందర్భంగా...
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. ''సూర్యప్రతాప్ డైరెక్ట్ చేసిన 'కరెంట్' సినిమాకు మ్యూజిక్ అందించాను. ఇది మా కాంబినేషన్ లో వస్తోన్న రెండో చిత్రం. సుకుమార్ గారు చెప్పడంతో బ్యాంకాక్ సాంగ్‌కు లిరిక్స్ తో పాటు డ్యాన్స్ కూడా కంపోజ్ చేశాను. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
దర్శకుడు సూర్యప్రతాప్ మాట్లాడుతూ.. ''సుకుమార్‌గారి కథను నేను డైరెక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ తరానికి చెందిన ఓ ప్రేమ కథ ఇది. దేవిశ్రీ, రత్నవేలు గారు ఈ సినిమాకు పనిచేయడం ఎప్పటికి మర్చిపోలేను. రాజ్‌తరుణ్, హేబా ల నటన అందరినీ ఆకట్టుకుంటుంది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్'' అని అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. ''ఈ సినిమా రూపొందడానికి కారణం సుకుమార్, రత్నవేలు, దేవిశ్రీప్రసాద్‌లే. సూర్యప్రతాప్‌గారు సినిమాను చక్కగా డైరెక్ట్ చేశారు. దేవిశ్రీగారి మ్యూజిక్, రత్నవేలు గారి ఫోటోగ్రఫీ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే ఈ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. నవంబర్ 20న విడుదలవుతున్న ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.
రత్నవేలు మాట్లాడుతూ.. ''గతంలో కూడా దేవిశ్రీ ప్రసాద్‌గారితో కలిసి పనిచేశాను. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా తప్పకుండా పెద్ద సక్సెస్ అవుతుంది'' అని అన్నారు.
రాజ్‌తరుణ్ మాట్లాడుతూ.. ''సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు వంటి టాప్ టెక్నిషియన్స్‌తో కలిసి పని చేయడం నా అద్రుష్టంగా భావిస్తున్నాను. నవంబర్ 20న సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ ఆదరిస్తారని భావిస్తున్నాను'' అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments