దిల్ రాజు చేతిలో కుమారి 21 ఎఫ్...
Send us your feedback to audioarticles@vaarta.com
డైరెక్టర్ సుకుమార్...నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నం కుమారి 21 ఎఫ్. ఈ చిత్రంలో రాజ్ తరుణ్, హేబా పటేల్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు సూర్యప్రతాప్ తెరకెక్కించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రానికి కథ-స్ర్కీన్ ప్లే సుకుమార్ అందించడంతో కుమారి 21 ఎఫ్ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఈ సినిమాని నైజాంలో దిల్ రాజు పంపిణీ చేస్తుండడంతో మరింత క్రేజ్ ఏర్పడింది. మరి...వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన కుమారి 21 ఎఫ్ అంచనాలను అందుకుంటుందా..? లేదా.. అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments