దిల్ రాజు చేతిలో కుమారి 21 ఎఫ్...

  • IndiaGlitz, [Thursday,November 05 2015]

డైరెక్ట‌ర్ సుకుమార్...నిర్మాత‌గా చేస్తున్న తొలి ప్ర‌య‌త్నం కుమారి 21 ఎఫ్. ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్, హేబా ప‌టేల్ జంట‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు సూర్య‌ప్ర‌తాప్ తెర‌కెక్కించారు. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించిన ఆడియోకు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఈ చిత్రానికి క‌థ‌-స్ర్కీన్ ప్లే సుకుమార్ అందించ‌డంతో కుమారి 21 ఎఫ్ సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దీనికి తోడు ఈ సినిమాని నైజాంలో దిల్ రాజు పంపిణీ చేస్తుండ‌డంతో మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. మ‌రి...వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన కుమారి 21 ఎఫ్ అంచ‌నాల‌ను అందుకుంటుందా..? లేదా.. అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.