కుమారి 21 ఎఫ్ సెన్సార్ రిపోర్ట్..
Send us your feedback to audioarticles@vaarta.com
డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా మారి చేస్తున్న తొలి ప్రయత్నం కుమారి 21 ఎఫ్. ఈ చిత్రంలో రాజ్ తరుణ్, హేబా పటేల్ జంటగా నటించారు. సుకుమార్ శిష్యుడు సూర్యప్రతాఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన కుమారి 21 ఎఫ్ మూవీ ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక సెన్సార్ రిపోర్ట్ విషయానికి వస్తే...సెన్సార్ బోర్డ్ వారు కుమారి 21 ఎఫ్ మూవీకి ఎ సర్టిఫికెట్ ఇచ్చారు.
దీంతో ఎ సర్టిఫికెట్ వచ్చిందంటే ఈ మూవీలో ఏముందో...ఏమి చూపించారో అనే ఆసక్తి పెరిగింది. నేటి యువత ఆలోచనా విధానం ఎలా ఉంది అనే విషయాల్ని ఈ మూవీలో చర్చించారని సమాచారం. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉండే కుమారి అందర్నీ ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 20న రిలీజ్ చేయనున్నారు. మరి...కుమారి ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments