కుప్పకూలిన కుమారన్న సర్కార్..
Send us your feedback to audioarticles@vaarta.com
కన్నడనాట బలపరీక్షలో కుమారన్న సర్కార్ కుప్పకూలిపోయింది. ఓటింగ్‌లో కుమారస్వామి ప్రభుత్వం ఓడిపోయింది. కుమారస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 105 ఓట్లురాగా.. అనుకూలంగా కేవలం 99 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో కుమారన్న సర్కార్ కూలిపోయినట్లైంది. కనీసం మేజిక్ ఫిగర్ అయిన 102 మంది ఓట్లేశారని కుమారస్వామి భావించినప్పటికీ అనుకున్నదేదీ జరగలేదు. ఈ సందర్భంగా స్పీకర్ రమేశ్ కుమార్ మాట్లాడుతూ కుమారన్న సర్కార్ ఓడిందని.. ప్రతిపక్షమే నెగ్గిందని అధికారికంగా ప్రకటించారు.
స్పీకర్ మాటల్లోనే..
" సభలో 206 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్-జేడీఎస్‌కు అనుకూలంగా 99 ఓట్లు వచ్చాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 105 ఓట్లు వచ్చాయి. విశ్వాస పరీక్షలో బీజేపీనే గెలిచింది"అని రమేశ్ కుమార్ ప్రకటించారు. దీంతో పదిరోజులగా సాగిన హైడ్రామకు తెరపడినట్లైంది. ఇదిలా ఉంటే.. సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గి.. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం 14నెలలు పాటు మాత్రమే అధికారంలో ఉన్నది. సభలో అంతకుముందు అసలేం జరిగిందన్న విషయాలు ఇప్పుడు చూద్దాం.
కుమారన్న భావోద్వేగం!
"అవసరమైతే సీఎం పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. సంతోషంగా ఈ పదవి నుంచి తప్పుకుంటాను. ఉన్నంతకాలం నిజాయితీగా పనిచేశాను. తప్పులు చేసినా.. వాటిని సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేశాను. కర్ణాటక రైతులను నేను మోసం చేయలేదు.. వారికి న్యాయం చేశాను. అసెంబ్లీలో ఓటింగ్‌కు మేం సిద్ధంగా ఉన్నాం. డివిజన్ పద్ధతిలో మాత్రమే ఓటింగ్ నిర్వహించాలి. నేనేంటో ప్రపంచానికి తెలుసు. నా కుటుంబం వ్యవసాయం నేపథ్యం ఉన్నది.. అక్కడ్నుంచే రాజకీయాల్లోకి వచ్చింది. ప్రస్తుత రాజకీయాలతో తాను విసిగొత్తిపోయాను. నేను యాక్సిడెంటల్ పొలిటీషియన్‌ని. ప్రజల కోసం కష్టపడి పని చేయడం మాత్రమే మాకు తెలుసు. నేను కనీసం ప్రభుత్వ కారు కూడా ఉపయోగించడం లేదు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయను.. చేయబోను. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమించాను. అధికారుల సహకారంతోనే ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ వచ్చాను. బలపరీక్షను ఇలా పొడిగించుకుంటూ పోవాలనేది నా ఉద్దేశం ఏ మాత్రం మాత్రం కాదు. ఇందువల్ల కలిగిన అసౌకర్యానికి స్పీకర్‌కు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతున్నాను" అని కుమారన్న తీవ్ర భావోద్వేగాని లోనయ్యారు.
రాజీనామాకు ఇద్దరూ సిద్ధం!!
ఇదిలా ఉంటే.. సంకీర్ణ ప్రభుత్వానికి తగిన బలం లేదని దాదాపు తేలిపోయినట్లే. ఇవాళ పొరపాటున బలపరీక్ష పెడితే మాత్రం అంతే సంగతులు. సీఎం సీటు బీజేపీ ఖాతాలో పడుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే విశ్వాసపరీక్షకు దూరంగా ఉండే అవకాశాలున్నాయి.. అంతేకాదు.. బలపరీక్ష ఇలా వరుసగా వాయిదా వస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అంతేకాదు.. ప్రస్తుతం కుమారన్న ప్రసంగిస్తున్నారు.. ఆయన తన ప్రసంగం తర్వాత గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పిస్తారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే స్పీకర్ రమేశ్ కుమార్ మాట్లాడుతూ.. తాను ఉదయం నుంచి రాజీనామా లేఖను జేబులో పెట్టుకునే ఉన్నానని.. తనపై బీజేపీ చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు. ఎమ్మెల్యేల రాజీనామా విషయంలో తాను రూల్స్ ప్రకారమే వ్యవహరించానన్నారు.
ఎవరికెంత బలం..!?
సభలో మెజార్టీకి కావాల్సిన మేజిక్ ఫిగర్ 103 మాత్రమే. సభకు హాజరయిన బీజేపీ ఎమ్మెల్యేలు 105 మంది ఉండగా.. మరో వైపు రెబల్స్ తిరుగుబాటుతో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల సంఖ్య కేవలం 101 మాత్రమే ఉంది. కాగా స్పీకర్, నామినేటేడ్ ఎమ్మెల్యేలను తీసివేస్తే అధికారపక్షం బలం 99 మాత్రమే అవుతుంది. 15 మంది రెబల్స్, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సభకు గైర్హాజరయ్యారు. ఈ సమయంలో స్పీకర్ బలనిరూపణకు ఆదేశిస్తే విశ్వాస పరీక్షలో కుమారస్వామి ప్రభుత్వం పడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అన్నట్లుగానే కుమారన్న సర్కార్ విశ్వాస పరీక్షలో వీగిపోయింది.
బెంగళూరు వ్యాప్తంగా నిషేదాజ్ఞలు
ఇదిలా ఉంటే.. కుమారస్వామి విశ్వాస పరీక్ష నేపథ్యంలో బెంగళూరు వ్యాప్తంగా పోలీసులు నిషేదాజ్ఞలు విధించారు. రేపు అనగా బుధవారం సాయంత్రం 6గంటల వరకు బెంగళూరు వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉండనుంది. ఎల్లుండి సాయంత్రం వరకు బార్లు, వైన్స్, పబ్‌లు బంద్ కానున్నాయి. కాంగ్రెస్ కూటమి పడిపోతే అల్లర్లు జరగకుండా ఉండేందుకు గాను పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments