జూలై 16న ఆహాలో 'కుడి ఎడమైతే'.. ఉత్కంఠగా టీజర్!
Send us your feedback to audioarticles@vaarta.com
చిన్న, మీడియం బడ్జెట్ లలో థ్రిల్లర్ చిత్రాలకు ఓటిటిలు వేదికలుగా మారుతున్నాయి. ప్రేక్షకులు కోరుకునే థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఓటిటి వేదికలలోకి సినిమాలు తీసుకువస్తున్నారు. యు టర్న్ చిత్ర దర్శకుడు పవన్ కుమార్ దర్శకత్వంలో థ్రిల్లర్ కథాంశంతో 'కుడి ఎడమైతే' అనే చిత్రం తెరకెక్కుతోంది.
ఈ చిత్ర రిలీజ్ డేట్ ఖరారైంది. జూలై 16న ఈ చిత్రాన్ని ఓటిటి వేదిక ఆహాలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ ఉత్కంఠని రేకెత్తించే విధంగా ఉంది. ఈ చిత్రంలో డెబ్యూ నటుడు రాహుల్ విజయ్, అమలాపాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎప్పటికైనా నటుడు కావాలని కలలు కనే ఓ డెలివెరి బాయ్ కథ ఈ చిత్రం. అతడి జీవితంలో జరిగిన ఊహించని సంఘటన ఎలాంటి మలుపులకు దారి తీసింది అనే పాయింట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఆ కుర్రాడి జీవితంలో ప్రేమ ఎలాంటి మార్పులకు కారణం అయింది అనే అంశాలని టీజర్ లో టచ్ చేశారు. ఇక అమలాపాల్ ఎలాంటి పాత్రలో నటిస్తోంది అనేది సస్పెన్స్. టీజర్ చూస్తుంటే ప్రామిసింగ్ గా ఉంది. రాహుల్ ఓ ఇంట్లో డెలివెరికి వెళ్ళినప్పుడు అక్కడ ఊహించని పరిస్థితులలో చిక్కుకుంటాడు. ఆ పరిస్థితులు ఏంటి.. వాటిని ఎలా అధికమించాడు అనేది కుడి ఎడమైతే కథ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com