KTR:ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్.. తమ గురి తప్పిందని ట్వీట్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాజా ఫలితాలు నిరాశ కలిగించాయని.. రాష్ట్రంలో రెండుసార్లు విజయం అందించినందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తప్పులు సరిదిద్దుకుంటామని.. ఓటమిని ఓ పాఠంగా తీసుకుని తిరిగి పుంజుకుంటామని పేర్కొన్నారు. అలాగే విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అభినందనలు చెబుతూ ట్వీట్ చేశారు. అలాగే శనివారం రాత్రి హ్యాట్రిక్ కొట్టబోతున్నామని గన్ పట్టుకుని ఉన్న ట్వీట్‌పై కూడా స్పందింస్తూ లక్ష్యాన్ని చేరుకోవడంలో తమ గురి తప్పిందని కూడా మరో ట్వీట్‌లో వెల్లడించారు.
అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఫలితాలపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. "ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎగరవేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కొనఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటా. ఈ గడ్డ పై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటా. దేశానికి కొడంగల్‌ను ఒక మోడల్‌గా నిలబెడతా" అని తెలిపారు.
ఇక సిరిసిల్లలో కేటీఆర్ 29 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా.. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి 32,800 ఓట్లతో ఘన విజయం సాధించారు.
Grateful to the people of Telangana for giving @BRSparty two consecutive terms of Government 🙏
— KTR (@KTRBRS) December 3, 2023
Not saddened over the result today, but surely disappointed as it was not in expected lines for us. But we will take this in our stride as a learning and will bounce back…
ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.
— Revanth Reddy (@revanth_anumula) December 3, 2023
కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటా.
ఈ గడ్డ పై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే… pic.twitter.com/v9hcZ4VpB3
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com