KTR:ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్.. తమ గురి తప్పిందని ట్వీట్..

  • IndiaGlitz, [Sunday,December 03 2023]

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాజా ఫలితాలు నిరాశ కలిగించాయని.. రాష్ట్రంలో రెండుసార్లు విజయం అందించినందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తప్పులు సరిదిద్దుకుంటామని.. ఓటమిని ఓ పాఠంగా తీసుకుని తిరిగి పుంజుకుంటామని పేర్కొన్నారు. అలాగే విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అభినందనలు చెబుతూ ట్వీట్ చేశారు. అలాగే శనివారం రాత్రి హ్యాట్రిక్ కొట్టబోతున్నామని గన్ పట్టుకుని ఉన్న ట్వీట్‌పై కూడా స్పందింస్తూ లక్ష్యాన్ని చేరుకోవడంలో తమ గురి తప్పిందని కూడా మరో ట్వీట్‌లో వెల్లడించారు.

అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఫలితాలపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎగరవేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కొనఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటా. ఈ గడ్డ పై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటా. దేశానికి కొడంగల్‌ను ఒక మోడల్‌గా నిలబెడతా అని తెలిపారు.

ఇక సిరిసిల్లలో కేటీఆర్ 29 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించగా.. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి 32,800 ఓట్లతో ఘన విజయం సాధించారు.

More News

BJP Candidates:గెలుపొందిన బీజేపీ అభ్యర్థులు వీరే..

గత ఎన్నికల్లో కంటే ఈసారి బీజేపీ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారు. ఇప్పటివరకు 5 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా..

Revanth Reddy, Komati Reddy:కొడంగల్‌లో రేవంత్ రెడ్డి.. నల్గొండలో కోమటిరెడ్డి ఘన విజయం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్‌లో భారీ మెజార్టీతో గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై 32,800ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.

Revanth Reddy:రేవంత్ రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్.. శుభాకాంక్షలు..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ వెళ్లారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Congress, Brs:దక్షిణ, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్.. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ హవా..

దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ కనబరుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో క్లీన్ స్వీప్ దిశగా కొనసాగుతోంది.

Congress Party:తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ బోణీ.. రెండు చోట్ల విజయం..

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్వారావుపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ..